జయం చైల్డ్ ఆర్టిస్ట్.. ఇలా మారిపోయిందేంటి.. చూస్తే మతిపోద్ది?

praveen
ఇప్పుడంటే ఫెయిడ్ అవుట్ దర్శకుడిగా  పేరు సంపాదించుకున్నాడు. కానీ ఒకప్పుడు తేజ స్టార్ డైరెక్టర్గా ఎంతల హవా నడిపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యూత్ ఫుల్ లవ్ స్టోరీ మూవీస్ తీయడంలో తేజను మించిన దర్శకుడు మరొకరు ఉండేవారు కాదు. ఇక ఇలాంటి లవ్ ఎంటర్టైనింగ్ సినిమాలతోనే బ్లాక్బస్టర్లు కొట్టారు తేజ. ఇలా దర్శకుడు తేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలలో జయం మూవీ కూడా ఒకటి. నితిన్ కు ఇది డెబ్యూ మూవీ అన్న విషయం తెలిసిందే.

 ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సదా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఈ సినిమాను ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులు అస్సలు మరిచిపోలేరు. ఒకరకంగా యూత్ అందరిని కూడా తెగ ఆకర్షించి.. ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది జయం సినిమా. ఇక యాక్షన్ హీరో గోపీచంద్ ఈ మూవీలో విలన్ గా నటించి మెప్పించారు. ఇక ఈ మూవీకి ఆర్పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ ప్రాణం పోసింది అనడంలో సందేహం లేదు. ఇప్పటికి కూడా అక్కడక్కడ ఈ సినిమా పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించిన అమ్మాయి పాత్ర కూడా అందరిని ఆకట్టుకుంటుంది. అక్షరాలను రివర్స్ లో రాయడం.. హీరోకి హీరోయిన్ గురించిన సమాచారాన్ని చేరవేయడం చేస్తూ ఉంటుంది  ఆ చైల్డ్ ఆర్టిస్ట్.

 ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు యామిని శ్వేత నాయుడు  ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కానీ ఇప్పుడు ఏమైనా చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది  ఒక రకంగా చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోతారు. ఇంత అందాన్ని ఇన్నాళ్లు చూడలేకపోయామా అని బాధపడతారు. ఈమె ఇంకా ఎందుకు స్టార్ హీరోయిన్ అవ్వలేదు అని ఆలోచనలో పడతారు. జయం సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ చిన్నది.  తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. ఇక ఈ మూవీ తర్వాత చదువుపై దృష్టి పెట్టింది. ఇక ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. పెళ్లి కూడా చేసుకుంది. అయితే సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారిపోగా ఆమెను చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: