కార్తీకి కోటి రూపాయల చెక్ ఇచ్చిన హీరో ధనుష్.. ఎందుకంటే..!?

Anilkumar
ప్రముఖ తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ధనుష్ ఇటీవల పలు కారణాలవల్ల ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే వస్తున్నాడు. అయితే తాజాగా ఇప్పుడు ఆయనకి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ధనుష్ ఇప్పుడు ఏకంగా ఒక కోటి రూపాయల విరాళం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కోలీవుడ్ ప్రముఖ నటుడు కార్తీకి ధనుష్ కోటి రూపాయల చెక్క అందించాడు .ఏంటి ధనుష్ ఎందుకు ఇంత భారీ మొత్తంలో హీరో కార్తీకి విరాళం ఇచ్చాడు. అని అనుకుంటున్నారా..

 ఇదే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే ఈ డబ్బంతా కళాకారుల కోసం ధనుష్ కార్తీక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణానికి ధనుష్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ఆయనకు నడిగర్ సంఘం ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపింది .ఇక ఇదే విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే ధనుష్ ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఒక్కొక్క సినిమాకి దాదాపుగా కోట్ల రూపాయల లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కేవలం సినిమాలు

 చేయడమే కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం లో కూడా ముందుంటున్నాడు ధనుష్. అందుకు నిదర్శనం ఇప్పుడు ఈ కోటి రూపాయల చెక్ అని చెప్పొచ్చు. అయితే ఆ కోటి రూపాయల చెక్కును ధనుష్ కార్తీకి అందిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరి కలిసి దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిందిజ. ధనుష్ చేసిన పనిని అభిమానులు, సెలబ్రిటీలు ప్రశంసిస్తున్నారు.చెన్నైలో సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం కొత్త భవనం నిర్మిస్తున్నారు. అందుకు విరాళాలు సేకరిస్తున్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ నాసర్, కోశాధికారి కార్తీలకు ధనుష్ చెక్ అందించారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఈ ఆలోచనను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. గతంలో కమల్ హాసన్, దళపతి విజయ్ కూడా కళాకారుల సంఘానికి కోటి రూపాయల విరాళం అందించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: