రామోజీరావు : ప్రాంతీయవార్తలు ప్రథమ ‘విలేఖరి’!

RAMAKRISHNA S.S.
చెరుకూరి రామోజీరావు తెలుగు మీడియా రంగంలోనే కాదు... భార‌త‌దేశ మీడియా రంగంలో ఓ తిరుగులేని మీడియా సామ్రాజ్యాధినేత‌. రామోజీ తెలుగు మీడియా రంగంలో ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అయ్యారు. ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. ఒక‌ప్పుడు జాతీయ మీడియా నుంచి మొద‌లు పెట్టి ప్రాంతీయ మీడియాలో పేప‌ర్ల‌లోనూ కేవ‌లం మెయిన్ ఎడిష‌న్ మాత్ర‌మే ఉండేది. అయితే అలా కాకుండా సినిమా వార్త‌ల‌కు సినిమా పేజ్‌లు ప్ర‌త్యేకంగా ప్రారంభించిన ఆయ‌న ..ఆ త‌ర్వాత లోక‌ల్ వార్త‌ల కోసం జిల్లా ఎడిష‌న్ ప్రారంభించారు. ఇది తెలుగు మీడియా రంగంలోనే ఓ సంచ‌ల‌నం.

ఆ త‌ర్వాత మిగిలిన మీడియా సంస్థ‌లు అన్నీ రామోజీ బాట‌లోనే న‌డ‌వ‌క త‌ప్ప‌లేదు. అన్నీ మీడియా సంస్థ‌లు లోక‌ల్ ఎడిష‌న్లు స్టార్ట్ చేశాయి. దీంతో ఆయా జిల్లాల పేరుతో ప్ర‌తి పేప‌ర్ కూడా ప్ర‌చురించ‌డం మొద‌లు పెట్టారు. ఆయ‌న ప్రారంభించిన జిల్లా ఎడిష‌న్ల‌కు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. త‌ర్వాత కాలంలో సిటీ ఎడిష‌న్లు ప్రారంభ‌య్యాయి. సిటీ వార్త‌లు ప్ర‌త్యేకంగా పేజీలు పెట్టి ప్ర‌చురించే వారు. ఇవి కూడా బాగా ఆద‌ర‌ణ పొందాయి.

సిటీ ఎడిష‌న్లు స‌క్సెస్ అయ్యాక‌.. రామోజీరావు నియోజ‌క‌వ‌ర్గాల కోసం ప్ర‌త్యేకంగా జిల్లా ఎడిష‌న్ మ‌ధ్య‌లో రెండు పేజీలు తీసుకువ‌చ్చారు. ఏ నియోజ‌క‌వ‌ర్గానికి ఆ నియోజ‌క‌వ‌ర్గానికి అనుగుణంగా రెండు పేజీలు పెట్టి అందులో నియోజ‌క‌వ‌ర్గాల వార్త‌లు వేసేవారు. ఈనాడు దెబ్బ‌కు మిగిలిన పేప‌ర్లు క‌కావిక‌లం అయ్యాయి. అయితే క‌రోనా ముందు వ‌ర‌కు ఇవి బాగా స‌క్సెస్ అయ్యాయి. క‌రోనా వ‌చ్చాక నియోజ‌క‌వ‌ర్గాల ఎడిష‌న్ల తో పాటు జిల్లా ఎడిష‌న్ల పేజీలు చాలా వ‌ర‌కు కుదించారు.

ఇక న్యూస్‌టుడే పేరుతో ప్ర‌త్యేకంగా ప్రాంతీయ వార్త‌ల కోసం కంట్రిబ్యూట‌ర్ల వ్య‌వ‌స్థ‌ను ఈనాడు ఏర్పాటు చేసింది. ఇది తెలుగు మీడియా రంగంలో ఓ సంచ‌ల‌నం అయ్యింది. విస్తృత‌మైన నెట్‌వ‌ర్క్ వ్య‌వ‌స్థ‌ను ఆయ‌న న్యూస్‌టుడేతో ప‌రిచ‌యం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: