"మనమే" మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ తాజాగా మనమే అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... వషిం అబ్దుల్ బాహీబ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ నిన్న అనగా జూన్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. మరి ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 70 లక్షల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 15 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 58 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా మొదటి రోజు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.43 కోట్ల షేర్ ... 2.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని మొదటి రోజు 15 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 25 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి మొదటి రోజు 1.83 కోట్ల షేర్ ... 3.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 10.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 9.17 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: