తాగున్నావా.. చారీ!- రామోజీ నిబ‌ద్ధ‌త‌కు మ‌చ్చుతున‌క‌...!

RAMAKRISHNA S.S.
రామోజీ రావు నిబద్ధ‌త‌కు అనేక ఉదాహ‌ర‌ణలు ఉన్నాయి. కానీ, కొన్ని కొన్ని మాత్రం సంస్థ ఉద్యోగుల‌కు ఆసాంతం గుర్తుండిపోతాయి. ఇలాంటి ఉదాహ‌ర‌ణే.. తాగున్నావా.. చారీ! అనే మాట‌. ఇది ఓ 20 ఏళ్ల కింద‌టి ఉద్యోగుల‌కు ఇప్ప‌టికీ ఈనాడులో గుర్తుండిపోయింది. అప్ప‌టి నుంచి ప్ర‌తి ఒక్క‌రూ.. అత్యంత జాగ్ర‌త్త‌గా.. ఈనాడుకు ప‌నిచేశారు. అప్ప‌ట్లో ఈ మాట రామోజీ స్వ‌యంగా.. రాసి.. ఇంట‌ర్న‌ల్ ప‌త్రిక‌లోనూ పోస్టు చేయించారు.

ఏం జ‌రిగింది?
రాజీవ్ గాంధీ ప్ర‌ధాన మంత్రిగా ఉన్న‌స‌మ‌యంలో బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించిన వార్త‌లు వ‌చ్చా యి. బోఫోర్స్ యుద్ధ విమానాల కొనుగోలు విష‌యంలో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. వంద‌లాది కోట్ల రూపాయ‌లు చేతులు మారాయ‌న్న‌ది ఆరోప‌ణ‌లు.అయితే.. ఇప్ప‌టికీ ఇది తేల‌లేదు. అయితే.. అప్ప‌ట్లో మాత్రం దేశాన్ని కుదిపేసిన కుంభ‌కోణం ఇదే. ఈ కుంభ‌కోణంపై ఈనాడు కూడా.. బ్యాన‌ర్ వార్త‌లు ప్ర‌చు రించింది. ఈ క్ర‌మంలో ఓ రోజు ప‌త్రిక ప‌తాక వార్త ఇదే!

అప్ప‌టి ఎడిటోరియ‌ల్ సెంట్ర‌ల్ డెస్క్ ఇంచార్జ్‌గా రామాచారి వ్య‌వ‌హ‌రించారు. ప‌త్రిక మొత్తం రెడీ అయిపోయింది. ఇక‌, ప్రింటుకు వెళ్తున్న స‌మ‌యంలో ప్రూఫుల‌ను అప్ప‌టికీ ఆఫీసులో ఉన్న రామోజీరా వుకు పంపించారు. ప‌తాక శీర్షికను ఆయ‌న చూశారో లేదో తెలియ‌దు. కానీ, తెల్ల‌వారి ప‌త్రిక వ‌చ్చేసింది. ప‌తాక శీర్షిక హెడ్డింగ్‌.. `బోఫోర్స్ వెనుక లోఫ‌ర్స్ ఎవ‌రు?` అని! ఇది పెను క‌ల‌క‌లం సృష్టించింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేత‌లు... ఈనాడు ఆఫీసుపై దాడులు చేశారు.

దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన రామోజీరావు.. అదే ప‌త్రిక‌.. అదే హెడ్డింగ్ కింద‌.. `తాగున్నావా.. చారీ!` అని ఒకే ఒక్క కామెంట్ రాశారు. అంతే.. ఆ మ‌రుక్ష‌ణం.. ఎడిటోరియ‌ల్ సెంట్ర‌ల్ డెస్క్ ఇంచార్జులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. త‌ర్వాత‌.. రోజు ప‌త్రిక‌లో.. రామోజీరావు.. ప్ర‌త్యేకంగా వ్యాసం రాస్తూ.. ప‌త్రిక నియ‌మ నిబంధ‌న‌లు పాటిస్తుంద‌ని.. జ‌రిగిన త‌ప్పున‌కు చింతిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఆ త‌ర్వాత‌.. ఇలాంటి కించ ప‌రిచే హెడ్డింగులు చాలా వ‌ర‌కు త‌గ్గిపోయినా.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, జ‌గ‌న్ విష‌యాల‌కు వ‌చ్చే స‌రికి మాత్రం మిన‌హాయింపు ఇవ్వ‌డం కొస‌మెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: