లోకేష్: నెక్స్ట్ జనరేషన్ కి సిద్ధమా..!

Divya
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఇటీవల కూటమి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో టిడిపి పార్టీ మరొకసారి అధికారంలోకి రావడమే కాకుండా మంచి హైప్ ఏర్పడింది. 2019 ఓటమి తర్వాత ఇక్కడ ఆ సామాజిక వర్గపు సామాజిక మూలాలు కూడా దెబ్బతిన్నాయి.. ఆ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎన్నికలలో కూడా దారుణమైనటువంటి పరాజయం కూడా మూట కట్టుకుంది. వీటన్నిటితో ఇక మీదట ఆ పని అయిపోయింది అనే విషయం తో పాటు టిడిపి బిజెపి విలీనంలోకి అవుతోంది అనే వార్తలు కూడా వినిపించాయి.

ఇప్పుడు ఆ పరిస్థితి వైసీపీ పార్టీకి మొదలయ్యిందని వార్తలను పలువురు నేతలు తెలియజేస్తున్నారు. ఏ పార్టీ కూడా సర్వనాశనం అయ్యేది ఉండదు.. ముఖ్యంగా పార్టీ రూపురేఖలను సైతం ఎలా మార్చాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉండాలని.. తెలంగాణలో లాగా పూర్తిగా టిడిపి పార్టీ కనుమరుగు కాలేదు ఆంధ్రాలో.. ఇప్పుడు ఐదేళ్లపాటు టీడీపీ పార్టీ అధికారంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లోకేష్ కూడా సిద్ధంగానే ఉన్నారు. ఆల్రెడీ భారీ మెజారిటీతో లోకేష్ గెలుపొందారు.

తెలుగుదేశం వారసత్వాన్ని పార్టీ నాయకులు కూడా ఆయనే వారసుడుగా కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ల ద్వారా ప్రజలు కూడా తనని చంద్రబాబు నాయుడు వారసుడిగా డిసైడ్ చేశారు. కాబట్టి యంగ్స్టర్ నేపథ్యంలో లోకేష్ కి ఎక్కువ మద్దతు ఉన్నట్టుగా కనిపిస్తోంది.. ఇక శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి 45 ఏళ్ల వరకు తిరుగు ఉండదని చెప్పవచ్చు.. ప్రాంతీయ పార్టీలలో డిఎంకె, బిజు జనతా పార్టీ వంటి వాటిలాగా ఉంటుంది.. అయితే బిజుజు జనతా పార్టీలో వారసత్వంలో లేదు.. డీఎంకేకు వారసత్వం ఉంది కాబట్టి సక్సెస్ అవుతూ వస్తోంది. ఇప్పుడు వారసత్వం అనేది కూడా ఒక స్ట్రాంగ్ హోల్డ్ అయ్యిందని చెప్పవచ్చు. మరి వైసీపీ పార్టీ ఎలాంటి నిర్ణయాలను సైతం తీసుకొని మళ్లీ తిరిగి పుంజుకొని ఇలా ప్రయత్నాలు చేస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: