స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న పాయల్ రాజ్ పుత్.. అసలేం జరిగిందంటే..?
తన విజయాలలో తన తండ్రి పాత్ర చాలా ఉందని గుర్తు చేస్తూ తనకు ఒక తండ్రిగా మాత్రమే కాకుండా ఒక హీరోగా ఎప్పుడు అండగా నిలిచేవారని, తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారంటూ కన్నీళ్లు పెట్టుకుంది.ఆ సమయంలో తన కుటుంబం చాలా మానసిక వేదనకు గురైందని, ముఖ్యంగా తన తల్లి క్లిష్ట పరిస్థితులలో తీవ్రమైన ఆందోళనకు గురయ్యారని ఆ సమయంలో తాను ఎలా ఓదార్చాలో కూడా తనకే అర్థం కాలేని పరిస్థితిలో ఉండేదానినట్టు తెలిపింది. తండ్రిని కోల్పోయి ఏడాదికావస్తున్న ఆయన లేని లోటు తనకు ప్రతిసారి కనిపిస్తోందని పాయల్ ఎమోషనల్ గా మాట్లాడింది.
తన జీవితంలో ఎదురైన అతిపెద్ద విపత్తు ఇదే అని దీని నుంచి కోలుకోవడానికి తాను జైపూర్లో విపాసన ధ్యానం చేస్తున్నట్లు తెలియజేసింది. తన తండ్రి మరణ వార్త తనని కలిగించిన ఆవేదన మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకే ఈ ప్రక్రియ తనకు కొంత సహాయపడుతోందని తెలియజేసింది. పాయల్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. 2017లో పంజాబీ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ కి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ 2023 లో వచ్చిన మంగళవారం సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది లీడర్ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుత కిరాతక అనే సినిమాలో నటిస్తోంది.