సినిమాలకు మించిన రివెంజ్ స్టోరీ.. వైసీపీ నేతపై ప్రతీకారం తీర్చుకున్న కాంగ్రెస్ నేత..??

Suma Kallamadi
సాధారణంగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు కానీ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కరణం కుటుంబాన్ని శాశ్వత శత్రువుగా చూస్తూ వస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో కృష్ణ మోహన్ ఉనికి లేకుండా కరణం బలరాం కుటుంబ సభ్యులు చేశారట. అందుకే ఆయన వారిపై రివేంజ్ తీర్చుకోవాలని చాలా రోజులుగా రగిలిపోతున్నారు. అయితే ఇటీవల ఎన్నికలతో ఆయన ప్రతీకారం తీరిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చీరాల నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు కృష్ణ మోహన్.
కరణం వెంకటేష్ వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంటెస్ట్ చేశారు. అయితే ఆయన 20,984 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాల కొండయ్య చేతిలో ఓడిపోయారు. కరణం వెంకటేష్‌కు 51,716 ఓట్లు వచ్చాయి. అయితే ఆయన తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చింది కృష్ణ మోహన్‌కే. ఆమంచికి 41,859 ఓట్లు వచ్చాయి. అంటే వీరిద్దరి మధ్య పదివేల ఓట్లు తేడా ఉంది. కృష్ణ మోహన్ ఓట్లను చీల్చడం వల్ల కరణం వెంకటేష్ టీడీపీ నేత చేతిలో ఓడిపోయారు. వేరే ప్రాంతంలో వైసీపీ ఇన్చార్జిగా ఉన్న ఆమంచి రెండు నెలల క్రితం ఆ పదవికి రాజీనామా చేసి చీరాలకు వచ్చేశారు.
రాజకీయం చేస్తూ కరణం కుటుంబాన్ని ఓడించాలని ఆయన బాగా ప్రయత్నించారు. చివరికి అనుకున్నది సాధించారు. తన ఆ రాజకీయ జీవితం చీరాల నియోజకవర్గంలోనే ముడిపడి ఉన్నందున వైసీపీ పార్టీని వీడినట్లు వెల్లడించారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి పార్టీ నుంచి బయటికి వచ్చేసారు. వైసీపీలో జాయిన్ అయ్యి అప్పటి టీడీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ పై పోటీ చేశారు. అయితే కానీ ఓడిపోయారు. అదృష్టం కొద్దీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాని కారణంగా నియోజకవర్గంలో తానే గెలిచినట్లుగా అన్ని పనులను చేశారు. అయితే టీడీపీలో ఉన్న కరణం వెంకటేష్ అనూహ్యంగా వైసీపీకి మద్దతు తెలవడం ప్రారంభించారు దాంతో ఆమంచి కృష్ణ మోహన్ కు పాపులారిటీ తగ్గిపోయింది. అదే క్రమంలో వైసీపీ అధిష్టానం డిమాండ్ మేరకు పర్చూరు వెళ్లాల్సి వచ్చింది.
 కానీ చీరాల నించి పోటీ చేసే అవకాశం తనకు ఇస్తుందేమో అని టికెట్ ఆశించారు కానీ చివరికి భంగపడ్డారు. కరణం వెంకటేష్ కు వైసీపీ టికెట్ ఇచ్చింది. దాంతో ఆమంచి బాగా ఫైర్ అయ్యారు. వెంకటేష్ ను ఎలాగైనా ఓడించాలని కాంగ్రెసులో చేరారు. నామినేషన్ వేసిన సమయం నుంచి తనకు కలిసి వచ్చే అన్ని అంశాలను ఉపయోగించుకుంటూ వైసీపీ ఓట్లను బాగా చీల్చేశారు. దీని ఫలితంగా కరణం వెంకటేష్ ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: