జబర్దస్త్ ను ఇంద్రజ వదిలేస్తే ఆ స్థానంలోకి వచ్చేది ఎవరు..?

Pulgam Srinivas
ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి కనులలో ఇంద్రజ ఒకరు. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం చాలా సినిమాలలో హీరోయిన్గా నటించి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈ మధ్య కాలంలో ఈమెకు సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు రాకపోవడంతో మూవీ లలో కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

ఇలాంటి సమయంలోనే ఈ బ్యూటీ కి జబర్దస్త్ కామెడీ షో లో జడ్జిగా అవకాశం వచ్చింది. ఇక జబర్దస్త్ లాంటి క్రేజ్ ఉన్న షో కు జడ్జిగా వ్యవహరించడంతో ఈమెకు ఈ షో ద్వారా మంచి గుర్తింపు లభించింది. దానితో చాలా సంవత్సరాల నుండి ఈమె కూడా జబర్దస్త్ షో కు జడ్జిగా కంటిన్యూ అవుతుంది. ఇకపోతే మొదట జబర్దస్త్ షో కు నాగబాబు , రోజా జడ్జిలుగా వ్యవహరించారు. మీరు చాలా సంవత్సరాల పాటు ఈ షో కు జడ్జ్ లుగా కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత నాగబాబు ఈ షో నుండి వెళ్లిపోయారు. ఆ స్థానంలో వచ్చిన మరి కొంత మంది కూడా ఈ షో నుండి వెళ్లిపోయారు.

ఇక రోజా చాలా సంవత్సరాలు జడ్జిగా చేసింది. కానీ ఈమెకు మంత్రి పదవి రావడంతో ఈమె కూడా ఈ షో నుండి వెళ్ళిపోయింది. ఆమె స్థానంలో వచ్చిన ఇంద్రజ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈమె కూడా ఈ షో నుండి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఇంద్రజ స్థానంలో జబర్దస్త్ షో కు జడ్జ్ గా ఎవరు వస్తారు అనే ఆసక్తి జనాలలో నెలకొంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ షో కు ఇంద్రజ స్థానంలో జడ్జి గా మీనా , కుష్బూ , అవని లేదా శ్రద్ధా దాస్ లలో ఎవరో ఒకరు జడ్జిగా వచ్చే అవకాశం ఉంది అని వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: