
శ్రీముఖి సినీరంగ ప్రవేశం గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..!!
ఇక ఆ షో చిత్రీకరణ సమయంలో శ్రీముఖిని చూసిన ఈటీవీ వాళ్ళు.. శ్రీముఖి చాలా బాగుంది. టీవీలో చేస్తుందా..? అని అడిగారట. అయితే శ్రీముఖికి అప్పుడు ఇంటరెస్ట్ లేదు, అసలు యాక్టింగ్ అండ్ హోస్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. దీంతో శ్రీముఖి.. నాకు ఏమి తెలియదని సమాధానం చెప్పారట. ఈటీవీ వాళ్ళు ఇచ్చిన ఆ ఆఫర్ ని శ్రీముఖి ఫాదర్ కూడా ఒప్పుకోలేదు. కానీ శ్రీముఖి మదర్ కి మాత్రం.. తన కూతుర్ని టీవీలో చూసుకోవాలని ఆశ కలిగింది.దీంతో తన భర్తతో ఆరు నెలలు పోరాడి.. శ్రీముఖి టీవీ షో చేయడానికి ఒప్పించారు. అలా టీవీలో వచ్చే 'అదుర్స్' అనే రియాలిటీ షోకి శ్రీముఖి హోస్ట్ గా చేసారు. శ్రీముఖితో పాటు ప్రదీప్ ఆ షోని హోస్ట్ చేసారు. అయితే శ్రీముఖి ఈ షోతోనే మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు. కానీ ఆడియన్స్ కి పరిచయమైంది మాత్రం ఈ షోతో కాదు. టీవిలో ఈ షో ప్రసారం లేటు అవ్వడంతో 'జులాయి' సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లిగా నటించి శ్రీముఖి ఆడియన్స్ కి పరిచయమయ్యారు. ఆ తరువాత ఈ షోతో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు.