రీ రిలీజ్ కి రెడీ అయిన అపరిచితుడు సినిమా.. ఎప్పుడంటే..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అభిమానులు తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా వారి కెరియర్ లో భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో ఒక సినిమాను ఎంచుకుంటూ రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోల సినిమాలు అలా రిలీజ్ అయ్యాయి. అయితే అలా రీ రిలీజ్ అయిన సినిమాలకు వచ్చిన కలెక్షన్లను సైతం చాలా మంది అభిమానులు మంచి పనుల కోసం ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక సినిమా రెడీ అయింది. స్టార్ డైరెక్టర్ శంకర్

 దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన అపరిచితుడు సినిమా అప్పట్లో ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో విక్రమ్ నటనకు ప్రేక్షకులు ఆయన ఫ్యాన్స్ అయిపోయారు. కాగా ఈ సినిమాలో విక్రమ్ కి జోడిగా సదా హీరోయిన్గా నటించింది. దర్శకుడు శంకర్ తమదైన స్టైల్ లో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. కాగా ఈ సినిమా అప్పట్లోనే మంచి కలెక్షన్స్ను సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను 4కే వెర్షన్ లో మే 17న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ..ఈ సినిమాకి హ్యారిస్ జయరాజ్ అద్భుతమైన మ్యూజిక్

 అందించారు..ఈ సినిమా పాటలు ఇప్పటికి ఎంతో పాపులర్ అని చెప్పవచ్చు.  అపరిచితుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ సామాజిక చిత్రం ఇందులో విక్రమ్, సధా, వివేక్, ప్రకాష్ రాజ్, నాజర్, కళభవణ్ మణి, సౌరబ్ శుక్ల తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ నిర్వహించారు మరియు నిర్మాతలు సుబ్రమాణ్యం, రుపేష్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హర్రిస్ జయరాజ్ స్వరాలు సమకుర్చారు. 2005 లో థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ కి రెడీ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: