పవన్ మెజారిటీపై బెట్టింగ్ రాయుళ్ళ ఒపీనియన్ కూడా అదే... ఏకంగా అంతా మెజారిటీనా..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరంలో జనసేన అనే పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించాడు. ఇక 2014 వ సంవత్సరం లోనే పార్టీని స్థాపించినప్పటికీ ఆ సంవత్సరం జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో ఈ పార్టీ పోటీలోకి దిగలేదు. ఇక 2019 వ సంవత్సరం ఈ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమంతాట పోటీలో నిలిచింది.

అందులో భాగంగా పవన్ కళ్యాణ్ రెండు ప్రాంతాల నుండి పోటీ చేయగా రెండింటిలో కూడా ఓడిపోయాడు. దానితో 2024 జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలను పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. దానితో పోయిన సారి చేసిన తప్పును ఈ సారి చేయకుండా కేవలం ఒకే నియోజకవర్గం నుండి పోటీలోకి దిగారు.

ఈ సారి పవన్ పిఠాపురం నియోజక వర్గం నుండి పోటీలోకి దిగారు. ఇక ఇక్కడ దాదాపు 75% వరకు కాపు ఓట్లు ఉండటంతో పవన్ కాపు సామాజిక వర్గ వ్యక్తి కావడంతో ఈ ప్రాంతం నుండి పోటీలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇక మొదటి నుండి పవన్ కి ఈ ప్రాంత ప్రజలు మంచి ఆదరణ చూపిస్తున్నారు. అలాగే అనేక మంది సినీ ప్రముఖులు కూడా ఇక్కడ ప్రచారాలను చేయడంతో పవన్ క్రేజ్ మరింతగా పెరిగింది.

ఇకపోతే దాదాపుగా పిఠాపురం నియోజకవర్గం లో పవన్ విజయం కన్ఫామ్ గా కనిపిస్తున్న ఎంత మెజారిటీ వస్తుంది అనే దానిపై బెట్టింగ్ రాయాల్లో అనేక అంచనాలను వేస్తున్నారు. దాదాపుగా 30 వేల మెజారిటీ కచ్చితంగా పవన్ కి వస్తుంది అని , వీలైతే 40 , 50 వేయ మెజారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది అని బెట్టింగ్ రాయల్లు బెట్టింగ్ లు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పవన్ ఈ సారి భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు అనేక మంది ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: