పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ చేసిన హీరోయిన్ లయ..!!

murali krishna
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు, నటన కంటే ఆయన వ్యక్తిత్వాన్ని చూసే పవన్‌కు అభిమానులుగా మారినవారు, మారుతున్న వారు ఎందరో.సామాన్యులతో పాటు సెలబ్రెటీలలోనూ పవన్ అభిమానులు ఉన్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నట్లుగా పవన్ స్థాయి వేరు, స్థానం వేరు.. అలాగే అందరు హీరోల్లోగా పవన్‌కు ఉండేది అభిమానులు కాదని, భక్తులని ఆయన చెబుతారు. రోజుకు కోట్లు సంపాదించే సత్తా ఉన్నప్పటికీ తనను ఇంతటి వాడిని చేసిన సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ రాజకీయాల్లోకి వచ్చారు. తాజాగా జనసేనానిపై సీనియర్ హీరోయిన్ లయ అభిమానాన్ని చాటుకుంటూ..ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ స్పీచ్‌లు ఇష్టమన్నారు. ప్రతినిత్యం రాజకీయ నాయకులు మాట్లాడినట్లుగా కాకుండా ఫ్రెష్‌గా, కొత్తగా పవన్ ఉపన్యాసాలు ఉంటాయన్నారు. ఆయన ఆహ్వానిస్తే పార్టీలో చేరడానికి సిద్దం. కానీ నన్నెందుకు పార్టీలోకి పిలుస్తారు. గతంలో నేను రామానాయుడు, ఇతర సినీ ప్రముఖులకు ఆంధ్రాలో ప్రచారం చేశాను. ఎవరైనా తనను ప్రచారం చేయమని అడిగితే.. ఆలోచిస్తాను అని అన్నారు.హీరోయిన్‌గా రాణించిన రోజా రాజకీయాల్లోకి వెళ్లి పక్కా పొలిటీషియన్‌లా మాట్లాడతారంటూ లయ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయ నాయకుడిలా కనిపించరా అని యాంకర్ ప్రశ్నించగా.. ఆయన సిన్సియర్‌గా ట్రై చేస్తున్నారని అనిపిస్తుందన్నారు. వేరొకరిని అనుకరించకుండా రాజకీయ నాయకుడంటే ఇలా కూడా ఉంటారా అనిపించేలా పవన్ వ్యక్తిత్వం ఉంటుందని లయ ప్రశంసించారు.
అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడ రోజా పేరును ప్రస్తావించడం వివాదాస్పదమయ్యేలా ఉంది. దక్షిణాదిలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రోజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో యాక్టీవ్ పనిచేసిన ఆమె.. తెలుగు మహిళ అధ్యక్షురాలిగానూ వ్యవహరించారు. అనంతరం వైసీపీలో చేరిన రోజా దూకుడుగా వెళ్లి ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. వాడి వేడి విమర్శలతో ప్రత్యర్ధులకు చెక్ పెట్టడం ఆమె శైలి. కానీ కొన్నిసార్లు రోజా వైఖరి విమర్శలకు తావిచ్చింది.2019లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోజా మాటలు పూర్తిగా వివాదాస్పదమయ్యాయి. సొంత పార్టీలోనే ఆమె తీరును తప్పుబట్టిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లయ సైతం సున్నితంగా రోజాకు చురకలంటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక లయ విషయానికి వస్తే.. స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మనోహరం, మిస్సమ్మ, విజయేంద్రవర్మ, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి సినిమాలతో తనదైన ముద్ర వేశారు. హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని భర్తతో కలిసి అమెరికాలో సెటిలైంది.
స్వతహాగా నృత్య కళాకారిణి అయిన లయ  అక్కడే డ్యాన్స్ స్కూల్ పెట్టి బాగానే నడిపించింది. అయితే కోవిడ్ 19 కారణంగా దానిని మూసేసి సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది. అవి బాగా పాపులర్ కావడంతో తిరిగి సినిమాలలో నటించాలని అభిమానులు కోరారు. దీంతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు లయ. నితిన్ సోదరుడు హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో ఆమె ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: