జగన్: రెండవసారి ప్రమాణ స్వీకారం.. ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన వై.వి.సుబ్బారెడ్డి..!

Divya
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయ పార్టీ నాయకులలో  గెలుపు దీమా పైన లెక్కలు వేసుకుంటున్నారు.. ముఖ్యంగా అధికార పార్టీ వైసిపి తో పాటు విపక్ష పార్టీ కూడా గెలుపు పైన భారీగానే అంచనాలు తెలియజేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ మరొకసారి గెలవబోతున్నట్లు ఆయనే తేల్చి చెప్పారు. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చే నెల 9వ తేదీన విశాఖలో రెండవ ప్రమాణస్వీకారం జగన్ చేయబోతున్నారనే విధంగా తెలియజేశారు. ఇప్పుడు తాజాగా వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా ఈ రోజున స్పందించడం జరిగింది.

ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి 150 సీట్లు మెజారిటీతో గెలుస్తుందని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. జగన్ చెప్పినట్టుగానే విశాఖలో వచ్చే నెలలో 9వ తేదీ ఉదయం 9:30 నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈనెల 13వ తేదీన పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, గిరిజనులు ,మైనార్టీ వారు వైసీపీ పార్టీకి ఓటు వేశారని తెలియజేశారు. తాజాగా సీఎం జగన్ కూడా తమకు గతంలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన 151యొక్క సీట్ల కంటే భారీ విజయం లభిస్తుందని తెలియజేశారు.
ఈ విషయాన్ని ఐ ప్యాక్ ఆఫీసులో వెల్లడించారు. వీటిని బట్టి చూస్తే వైసీపీ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా ఉన్నది..  ఆ పార్టీ నేతలు సైతం విజయం పైన ఎంత ధీమాగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు.. ప్రతిపక్ష నేతలు కూడా ఈసారి అధికారం తమ పార్టీదే అంటూ వెల్లడిస్తున్నారు.. ముఖ్యంగా బీజేపీ, జనసేన పార్టీలు తమకు అనుకూలంగా ఉన్నాయని అందుకే ఓటు శాతం పెరిగింది అనే విధంగా కూడా టిడిపి పార్టీ తెలియజేస్తోంది. మరి పూర్తి సమాచారం తెలియాలి అంటే వచ్చే నెల నాలుగవ తేదీ వరకు ఉండాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: