టాలీవుడ్ ఇండస్ట్రీపై హీరోయిన్ కాజల్ సంచలన వ్యాఖ్యలు..!

Divya
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు జోడిగా కూడా నటిస్తోంది ఈ ముద్దు గుమ్మ .అందం అభినయంతో ప్రేక్షకులను బాగానే సంపాదించుకుంది. వివాహమైన తర్వాత ఒక కుమారుడు పుట్టిన తర్వాత కూడా కెరియర్ పరంగా వరుస సినిమాలో చేస్తూ దూసుకుపోతోంది కాజల్. ఇటీవలే లేడీ ఓరియంటెడ్ చిత్రమైన సత్యభామ లో కూడా కాజల్ అగర్వాల్ నటించింది .ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో పాల్గొన్నా కాజల్ పలు విషయాలను తెలియజేశారు.
ముఖ్యంగా వివాహం తర్వాత తన కెరియర్లో ఎలాంటి మార్పు రాలేదని బాలీవుడ్ లో పెళ్లి తర్వాత కూడా హీరోయిన్స్ వరుస గా సినిమాలు చేస్తున్నారు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అలాంటి మార్పు తనకు కనిపించడం లేదని..వివాహమైన హీరోయిన్ల ను తీసుకోవడానికి మేకర్స్ ఆలోచిస్తూ ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ మార్పు కూడా వస్తుందనుకుంటున్నానంటూ తెలియజేసింది కాజల్ అగర్వాల్.
ఇక తన భర్త గౌతమ్ గురించి మాట్లాడుతూ తన భర్త అంటే తనకు చాలా ఇష్టమని తనకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడని ఎప్పుడూ కూడా తనని ప్రోత్సహిస్తూ ఉంటాడని తన వెంటే నిలబడతాడని కూడా తెలిపింది. తను ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి సమయం కేటాయిస్తానని తెలియజేసింది కాజల్ అగర్వాల్. కొన్ని సందర్భాలలో తన భర్త కూడా తన షూటింగ్ స్పాట్ కి వచ్చి కలుస్తూ ఉంటాడని అవసరమైతేనే ఫోన్ చేస్తాడు.. ఏదైనా బిజీ షెడ్యూలు ఉంటే తన మేనేజర్ కు లేదా మేకప్ మాన్ కి ఫోన్ చేస్తాడని తెలియజేసింది కాజల్ అగర్వాల్.తన భర్తకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడానికే సమయాన్ని కేటాయిస్తానని తెలిపింది కాజల్ అగర్వాల్. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ఇండస్ట్రీలో వివాహమైన హీరోయిన్లకు అవకాశాలు తక్కువగా వస్తాయి అనే విషయం వినిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: