టిల్లు క్యూబ్ కోసం మరో స్టార్ హీరోని దింపుతున్న సిద్దు..!!

murali krishna
గుంటూరు టాకీస్ సినిమాతో మంచి విజయం అందుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ. ఆ చిత్రంలో ఈ హీరో కామెడీ ఎంతో బాగా పండించినా.. ఎందుకనో పెద్దగా పేరు మాత్రం రాలేదు.ఆ తరువాత కూడా పలు సినిమాలలో కనిపించాడు. కానీ ఏ చిత్రం కూడా సిద్దుకి అనుకున్నంత రేంజ్ లో పేరు తెచ్చి పెట్టలేదు. టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ టిల్లు స్క్వేర్.. ఈ సినిమా డిజే టిల్లు సినిమాకు సిక్వెల్ గా వచ్చి హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది..టిల్లు స్క్వేర్‌తో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు హీరో సిద్ధూ జొన్నలగడ్డ.ఈ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో ‘టిల్లు క్యూబ్‌’పై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది..అనుపమ, సిద్దు కాంబోలో వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రైమ్ కామెడీ బాక్సాఫీస్ వద్ద రూ. 125 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.. ఇప్పటికి సినిమాకు సీక్వెల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఆ సినిమా గురించి సిద్దు ఓ ఇంటర్యూ లో చెప్పాడు.. గత రెండు సినిమాలకు భిన్నంగా వస్తుందని టాక్.. హీరోకు సూపర్ పవర్స్ ఉన్నట్లు సరికొత్తగా కథ ఉందని తెలుస్తుంది.. అంతేకాదు ఈ మూవీలో మరో స్టార్ హీరోను దింపుతున్నట్లు తెలుస్తుంది..

ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమాకి మూడవ భాగం కూడా రెడీ అవుతోంది. టిల్లు క్యూబ్ అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో కథ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని ముందు నుండి టాక్ వినిపిస్తోంది. తాజాగా సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజా సమాచారం ప్రకారం టిల్లు క్యూబ్‌ సినిమాలో మరో స్టార్ హీరో కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు అని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ హీరో ఎవరు? ఎలాంటి పాత్రలో కనిపిస్తారు అనే విషయాల మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఆ హీరోది ప్రత్యేక పాత్ర లేక కేవలం అతిధి పాత్ర అని కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరైనా సీనియర్ హీరో ఈ కీలక పాత్రలో నటించే అవకాశం ఉంది అని సమాచారం.ఈ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ రైటర్‌గా కూడా వర్క్ చేసిన సంగతి తెలిసిందే. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వార్తల్లో నిజమెంతో తేలాల్సి ఉంది.. ఇక డీజే టిల్లులో నేహా శెట్టి హీరోయిన్ కాగా, టిల్లు స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా కనిపించింది. అయితే పార్ట్ 3 కోసం మరో హీరోయిన్‌ను తీసుకోబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అందులోనూ పూజాహెగ్డే ను తీసుకోబోతున్నట్లు ఓ వార్త వినిపిస్తుంది.. అందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: