ఎన్టీఆర్ కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన సినిమాలేంటో తెలుసా..!?

Anilkumar
నందమూరి హీరోల్లో ఒకరిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమై ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం అర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ దేశాలను దాటింది. దాంతో ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే వస్తున్నాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు తారక్. హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 లో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే మే 20న (ఈ రోజు) జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఇక ఈ సందర్భంగా ఆయన బర్త్డే వేడుకలను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు అభిమానులు.
జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ కి బ్రేక్ ఇచ్చిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

జూనియర్ ఎన్టీఆర్ 17 ఏళ్లకే భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు తారక్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లకు పైగానే కావస్తోంది. ఇక 20 ఏళ్లలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ పేస్ చేశాడు. వాటన్నిటినీ అధిగమించి ఈరోజు దేశంలోనే గర్వించదగ్గ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్.  1991 లోనే ఆయన తాతగారు నటించిన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమాతో మొట్టమొదటిసారిగా ఆయన సినీ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. కానీ హీరోగా మాత్రం నిన్ను చూడాలి అనే సినిమా చేశాడు. ఇక తారక్ కి 19 ఏళ్ళు ఉన్నప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్, ఆది వంటి సినిమాలు చేశాడు. ఈ సినిమాల తర్వాత సింహాద్రి సినిమా చేశాడు. సింహాద్రి సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో మొదట బ్రేక్ ఇచ్చిన సినిమా. ఇక ఈ సినిమా తర్వాత సుబ్బు, అల్లరి రాముడు, ఆంధ్రావాలా, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ వంటి సినిమాలు చేశాడు. ఇలా అరడజనుకు పైగా సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ హీరోగా పనికిరాడు అని అందరూ అనుకుంటున్న సమయంలోనే రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ సినిమా చేశాడు. ఇక ఈ సినిమా ఎన్టీఆర్కి నెక్స్ట్ బ్రేక్ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత అదుర్స్, బృందావనం వంటి సినిమాల్లో చాలా స్టైలిష్ గా కనిపించినప్పటికీ   తర్వాత మళ్లీ టెంపర్ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు. పూరి జగన్నాథ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మళ్లీ ntr కెరీర్ కి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత చేసిన నాన్నకు ప్రేమతో వంటి అన్ని సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. టెంపర్ సినిమా తర్వాత మళ్లీ తన కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు తారక్. ఈ సినిమాల తరువాత చేసిన సినిమాలన్నీ కూడా వరుసగా హిట్స్ అందుకున్నాయి.. అలా ఇప్పుడు టాలీవుడ్ లో నంబర్ వన్ హీరో కొనసాగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: