కూలి పని చేసుకుంటున్న 'భీమ్లా నాయక్' సింగర్.. పద్మశ్రీ వచ్చినా దిక్కుతోచని స్థితిలో కిన్నెర మొగులయ్య!

Anilkumar
పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమాలో ఓ పాట పాడి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు కిన్నెర మొగులయ్య. ఆయన  వాయిస్తున్న వాయిద్యాలు పురాతనమైతివి కావడంతో మీడియా ఆయన్ను బాగా హైలైట్ చేసింది. దాంతో అయన ప్రతిభని గుర్తించి 'పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్'  సినిమాలో పాట పాడే అవకాశాన్ని కల్పించారు. ఆ పాట కాస్త పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్'  కే ప్రధాన ఆకర్షణగా మారింది. అక్కడితో మొగులయ్య సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయాడు. అక్కడితో ఆగకుండా మొగులయ్య కిన్నెర వాయించే కళకు కేంద్రం ఆయన్ని ఏకంగా పద్మశ్రీ సత్కారంతో గౌరవించింది. 

పద్మశ్రీ గుర్తింపుతో నేషనల్ లెవెల్ లో ఫేమస్ మొగులయ్యను  అప్పటి తెలంగాణా సీఎం kcr  ఘనంగా సత్కరించి కోటి రూపాయల నజరానాతో పాటూ సొంతంగా ఇల్లు నిర్మించుకోవడానికి 600 గజాల భూమి సైతం కేటాయించారు. దాంతో మొగులయ్య కష్టాలన్నీ ఇక తీరినట్లే అని అంతా అనుకున్నారు. పద్మశ్రీ పురష్కారాలు, ప్రభుత్వ నజరానాలు ఇవేవీ మొగులయ్య కడుపు నింపలేదు. ప్రస్తుతం ఆయన దిక్కు తోచని స్థితిలో కూలి పనికి వెళ్తున్నాడు. ఉన్న డబ్బులనీ ఖర్చయిపోయి, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇంటి నిర్మాణ పనులు కూడా సగం లోనే ఆపేసానని 

తాజాగా తన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన కొడుకులకు ఆరోగ్యం బాలేదని, మందుల కోసమే 7 వేల వరకు ఖర్చు అవుతుందని, 2, 3 నెలలుగా పెన్షన్ కూడా రావడం లేదని, చాల మంది తనపై జాలి చూపిస్తున్నారు తప్పితే ఎవరూ పని ఇవ్వడం లేదని.. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో కూలి పనికి వెళ్తున్నట్లు తెలిపాడు. 
మొగిలయ్య కుటుంబాన్ని పోషించుకునేందుకు డైలీ లేబర్ గా మారారు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన కొడుకు మెడికల్ ఖర్చులకే పతి నెల 7 వేలు అవసరం అవుతాయట. ప్రభుత్వం నుంచి వస్తున్న 10 వేలు ఎందుకు ఆపేశారో తనకి తెలియదు అని మొగులయ్య అంటున్నారు.
 మరి దీన స్థితిలో ఉన్న మొగులయ్యను ఆదుకునేందుకు ఎవరైనా ముందుకొస్తారో, లేదో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: