పొత్తు లేకపోతే టీడీపీకి అన్ని సీట్లు మాత్రమే వస్తాయట.. కూటమి నేతల అభిప్రాయమిదే!

Reddy P Rajasekhar
2019 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీకి 2004 ఎన్నికల్లో వైఎస్సార్ వల్ల భారీ షాక్ తగిలితే 2019 ఎన్నికల్లో జగన్ వల్ల అంతకు మించి షాక్ తగిలింది. 2019 ఎన్నికల ఫలితాల దెబ్బకు రాష్ట్రంలో టీడీపీ పుంజుకోవడం కష్టమని కామెంట్లు వినిపించినా వేర్వేరు కారణాల వల్ల రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి క్రమంగా మెరుగుపడింది.
 
ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామని టీడీపీ నేతలు చెబుతున్నా కూటమి 60 నుంచి 70 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పొత్తు లేకపోతే మాత్రం టీడీపీ కేవలం 30 నుంచి 40 స్థానాలకే పరిమితం అయ్యేదని జనసేన సొంతంగా పోటీ చేసి ఉంటే ఓట్లు చీలేవని నెటిజన్ల నుంచి, కొంతమంది కూటమి నేతల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
కూటమి ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోనే ఆ పార్టీకి ఊహించని స్థాయిలో మైనస్ అయ్యాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కూటమి హామీలు మరీ ఓవర్ గా ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు. కూటమికి వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వస్తే పార్టీ నేతల నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. కూటమి నేతలు ఇప్పటికే ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉండి బాధలో ఉన్నారు.
 
మరో ఐదేళ్లు అధికారం దూరమైతే అనే ఆలోచన భయంకరంగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూన్ 4వ తేదీ కూటమికి మేలు చేస్తుందో కీడు చేస్తుందో చూడాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్నికల ఫలితాల విషయంలో ఒకింత టెన్షన్ తోనే ఉన్నారని సమాచారం అందుతోంది. తలలు పండిన విశ్లేషకులు సైతం ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేమని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: