కొనకపోతే కొట్టేలాగే ఉన్నాడే.. పుచ్చ పండు ఎలా అమ్ముతున్నాడో చూడండి?

praveen
ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడ లేని పనులన్నీ కూడా మార్కెట్లో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే  కొన్ని సీజన్ ఫ్రూట్స్ ఉంటే ఇంకొన్ని మాత్రం రెగ్యులర్ గా దొరికే పండ్లు కూడా మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా ఒకవైపు ఎండలు దంచి కొడుతుంటే.. ఇక ఈ ఎండల నుంచి కాస్త ఉపశమనాన్ని కలిగించే పండు ఏదైనా ఉంది అంటే అది పుచ్చపండు మాత్రమే.  ఎండాకాలం వస్తే చాలు రోడ్లపైన దుకాణాలలో ఎక్కడపడితే అక్కడ ఇక పుచ్చ పండ్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు.. ఎంతో మంది వీటిని కొనుగోలు చేయడం చూస్తూ ఉంటారు. ఇక వేసవిలో ఈ పండ్లకు మంచి గిరాకీ కూడా ఉంటుంది.

 అయితే రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఇక పుచ్చ పండ్ల దుకాణం కనిపిస్తే ఒకవేళ కొనాలనిపిస్తే కొంటారు.. లేదంటే సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఒక దుకాణం పక్క నుంచి వెళ్తున్నారు అంటే చాలు ఏకంగా భయంతోనే పుచ్చపండు కొనేస్తారు. ఇంతకీ భయం ఎందుకు అనుకుంటున్నారా.. ఏకంగా షాప్ ఓనర్ పుచపండు కొనకపోతే ఎక్కడ కొడతాడో అనే భయంతో చివరికి ఆ పండును కొనేస్తూ ఉంటారు  అదేంటి అనుకుని ఆశ్చర్యపోతున్నారు కదా.. సాధారణంగా పండ్ల వ్యాపారులు ఎంతో బిజీ బిజీగా గడుపుతారు. వినియోగదారులతో ఎంతో మంచిగా మాట్లాడుతూ తమ వ్యాపారాన్ని పెంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం చాలా వెరైటీ.

 ఎందుకంటే ఏకంగా మనుషులను భయపెట్టే విధంగా.. ఇక్కడ ఒక వ్యక్తి పుచ్చుకాయలను అమ్ముతున్నాడు. దీంతో అటువైపుగా వెళ్తే పుచ్చకాయలను కొనాలని ఉద్దేశం లేకపోయినా అతను ఎక్కడ కొడతాడో అనే భయంతో చివరికి కొనయొచ్చు కూడా. ఒక వ్యక్తి బండి పై పుచ్చకాయలు పెట్టుకొని అమ్ముతున్నాడు. ఆ సమయంలో అతడు చర్యలు చూసి ఎవరైనా భయపడతారు.  పుచ్చకాయ కోసి దానిని చూపించి.. నోరు తెరిచి బిగ్గరగా  అరుస్తున్నాడు. అక్కడితో ఆగకుండా తలపై స్టీల్ ట్రే తో కొట్టుకొని విత్తగా అరుస్తున్నాడు. ఇక అతడి చేష్టలు  చూసి చుట్టూ ఉన్నవారు పగలబడి నవ్వుకుంటున్నారు. పాపం కుటుంబ పోషణ కోసం అతనికి ఎంత కష్టం వచ్చింది అని ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: