యూత్‌ కోసం ఆలయాల్లో ఆ ఫెసిలిటీ.. ఇస్రో ఛైర్మన్‌ అదిరిపోయే ఐడియా?

Chakravarthi Kalyan
యువతను దేవాలయాలకు రప్పించడానికి ఆలయాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ సూచించారు. తిరువనంతపురంలోని శ్రీ ఉడియన్నూర్ దేవి ఆలయ సభ్యులు సోమనాథ్‌ను సన్మానించి అవార్డును ప్రదానం చేశారు. ఇస్రో మజీ ఛైర్మన్‌ జి.మాధవన్ నాయర్ చేతుల మీదగా అవార్డును అందుకున్న సోమనాథ్‌... దేవాలయాల్లో ఎందుకు గ్రంథాలయాలను ఏర్పాటు చేయకుడదని ప్రశ్నించారు.


ఆలయాలు కేవలం వృద్ధులు వచ్చి దైవనామ స్మరణ చేసుకునేవే కాకుండా సమాజాన్ని మార్చే ప్రభావవంతమైన ప్రదేశాలుగా మారాలని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ పేర్కొన్నారు. ఆలయాలకు యువత వచ్చే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. ఈ విధమైన చొరవతో ధార్మిక విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు, ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలనుకునేవారు ఆలయాలకు రావడానికి ఆసక్తి చూపుతారని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. ఈ ఐడియా బావుంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: