ఏపీ:కూటమిరేపిన కలకలం.. కూటమికే చేటు..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమికి భారీ దెబ్బ తగిలినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే బిజెపి గత కొన్ని రోజుల నుంచి ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని విధంగా తెలియజేస్తూ వస్తోంది. దీంతో పొత్తులో భాగంగా టిడిపి, బిజెపి, జనసేన పార్టీలో కలిశాయి ఆంధ్రాలో.. దీంతో మైనార్టీ ఓట్లు టిడిపికి పడలేదని వార్తలు అయితే వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా కడపలో డాక్టర్ సూరి పర్వీన్ తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే కడపలో పెద్ద దర్గా సెంటర్లో కేవలం పది రూపాయలకే వైద్య సేవలు అందించి మంచి ఆదరణ పొందారు. దివంగత నేత వైయస్సార్ కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్తోనే తాను ఎంబిబిఎస్ చదువుకున్నారని ఆయన స్ఫూర్తితోనే 10 రూపాయలకే వైద్యం అందిస్తున్నట్లుగా వెల్లడించారు.

ఆయనతో పాటు తన సోదరీనా పర్వీన్ తమ్ముడు బాబా మొహద్దీన్ కూడా డాక్టర్లే. మొదట విజయవాడలో టీవీ మెకానిక్ గా పని చేసిన తమ కుటుంబం ఏకంగా ఇప్పుడు ఏ ముగ్గురు డాక్టర్లను ఎదిగేలా చేసింది. అందుకు కారణం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమే అని కూడా చెప్పవచ్చు. వీరే కాకుండా ముస్లిం కుటుంబాల స్థితిగతే మారిపోయింది రిజర్వేషన్ వల్ల.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో వైఎస్ఆర్ ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ అటు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది ముస్లిం యువతకు చాలా భరోసాను కూడా కల్పించింది.

ముఖ్యంగా విద్యా వైద్య ఉద్యోగ విషయాలలో కూడా వీరికి బాగానే కలిసి వచ్చింది. ఇలా ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ సద్వినియోగం చేసుకున్న వారంతా మంచి ప్రతిభను కూడా చూపిస్తున్నారు. చాలామంది టీచర్లు డాక్టర్లు ఇంజనీరింగ్ ,ఆర్టీవోలు, డిఎస్సీలుగా కూడా పనిచేస్తున్నారు. దీంతో కూటమి రిజర్వేషన్ల తొలగించే కుట్ర చేస్తోందని ఇటీవలే పలు రకాల ఆరోపణలు కూడా వినిపించాయి.. అయితే జగన్ మాత్రం రిజర్వేషన్ల విషయంలో ఎప్పటికీ ముస్లింలకు సపోర్టుగానే ఉంటాను అంటూ తెలియజేశారు. ఈ విషయం చంద్రబాబు చెప్పలేకపోయారు. అందుకే మైనార్టీ ఓట్లన్నీ వైసీపీకి పడ్డాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: