ఏపీ: పొత్తేమో టిడిపితో..ప్రేమేమో వైసీపీ పై ..క్యా మతలబ్ మోదీజీ.!

Pandrala Sravanthi
రాజకీయాలు అంటేనే  తికమక పెట్టి తీన్మార్ డాన్స్ చేయిస్తూ ఉంటాయి. అలాంటి ఈ పాలిటిక్స్ ను అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. ఈ పాలిటిక్స్ లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. అలా అవసరాలకు తగ్గట్టు  రాజకీయాలు చేస్తేనే ఈ దేశంలో రాణించగలం. ఒకరినొకరు తీవ్రంగా దూషించుకున్న వారే, కలిసిపోయి  ఓకే కంచంలో తింటూ ఉంటారు. ఆ విధంగా  ప్రజలను తికమక పెడుతూ  నాయకులు పాలన సాగిస్తూ ఉంటారు. సాధారణంగా బిజెపి కి చంద్రబాబు ఏనాడు కూడా ఓ కోణాన సపోర్ట్ చేయలేదు. కానీ ఈ ఎలక్షన్స్ లో మాత్రం బిజెపితో పొత్తు పెట్టుకున్నాడు. అంతే కాదు స్వయానా ప్రధానమంత్రి మోడీ వచ్చి  టిడిపి కూటమికి మద్దతు ఇచ్చారు.

కానీ ప్రధానమంత్రి మాటల్లో మాత్రం  ఆ ఒక్కటి స్పష్టంగా కనబడింది. ఆయన ఏపీలో పర్యటన చేసిన కానీ  జగన్ ను మాత్రం ప్రధాన టార్గెట్ చేయలేదు. ఏదో తూతూ మంత్రంగా  ఆయన అభివృద్ధి చేయలేదని చెప్పారు తప్ప కీలకంగా టార్గెట్ చేసి ఆయన వ్యవహారాన్ని బయటకు తీసే ప్రయత్నం మాత్రం చేయలేదని చెప్పవచ్చు. అంటే ప్రధాని మోడీకి ఏదో ఒక కోణాంలో జగన్ పై ప్రేమ ఉంది. కానీ టిడిపి తో పొత్తు ఉంది కాబట్టి  మీదికి అలా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు మోడీజీ కే చెక్ పెట్టాలని చూసారు. బిజెపి పార్టీ నుంచి ప్రధానమంత్రిని ఎన్నిక చేసే సమయంలో  చంద్రబాబు ఘడ్కరిని ప్రధాని ని చేయాలని పట్టుబట్టారు.

లేదంటే బిజెపి కూటమి కి టీడీపీ సపోర్ట్ చేయలేదని చెప్పారు.కానీ అనూహ్యంగా  మోడీయే ప్రధాని అయ్యారు. చంద్రబాబు యూపీఏతో జత కట్టారు. ఇక అప్పటినుంచి  మోడీజీకి  చంద్రబాబు అంటే లోలోపల కోపమున్నా కానీ పైకి పార్టీ కోసం సపోర్ట్ చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం మోడీజీతో చాలా అన్యోన్యంగా ఉంటూ ఆయనకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. మోడీ ఈ ఎన్నికల్లో టిడిపి తో పొత్తు పెట్టుకున్నా కానీ, వైసిపి గెలవాలని అనుకుంటున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: