పాయా పాయా అంటూ.. హుక్ స్టెప్ తో అదరగొట్టేసిన బండ్ల గణేష్..!
అయితే ఈ పాటలో ప్రముఖ నటుడు, నిర్మాతగా పేరు సంపాదించిన బండ్ల గణేష్ తన స్టెప్పులతో ప్రత్యేకమైన ఆకర్షనీయంగా ఆకట్టుకున్నారు. ఈ పాట ఫుడ్ ఫెస్టివల్ లో సాగేటువంటి నేపథ్యంలోని పాట అన్నట్లుగా కనిపిస్తోంది. బండ్ల గణేష్ ఇందులో చాలా విభిన్నమైన దుస్తులలో మెరిసిపోతూ కనిపిస్తున్నారు. అలాగే ఇందులో కమెడియన్ ఆలీ, బబ్లూ మరి కొంతమంది కనిపించారు. ఈ సాంగ్ కి భోలే షావలి స్వరాలు అందించారు. జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ఉండే అభిమానం గురించి మళ్లీ ఇందులో చూపించారు.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అన్న కూడా హైదరాబాద్ సే పాయా మంగాయా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అన్న తిన్నాడు ఈ కాపాయా.. హిట్ల మీద హిట్టుతో పవర్ స్టార్ బన్ గయా అంటూ చేసిన లిరిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి ఒక చిన్న క్లిప్ ను నటుడు శివాజీ ఈశ్వర పరమేశ్వరా అనే క్లిప్ ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.. బండ్ల గణేష్ కు పవన్ కళ్యాణ్ పైన ఉండే ప్రేమ స్వచ్ఛమైనది సాటి లేనిది అంటూ తెలియజేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.