అలాంటి వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక చోప్రా భర్త..!
ప్రస్తుతం ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. వీరికి ఒక కూతురు కూడా జన్మించింది. గతంలో కూడా వీరు ఉంటున్న ఒక ఇంటిని కూడా అమ్మేసినట్లు వార్తలు వినిపించాయి.. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ ను ఒక అరుదైన వ్యాధి సోకిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ గా మారుతోంది.. దీంతో నిక్ జోనస్ ఆరోగ్యానికి సంబంధించి ప్రియాంక చోప్రా అభిమానులు కాస్త ఆందోళన పడుతున్నారు.
నీ జోనస్ తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేస్తూ తనకు ఇన్ఫ్లు ఎంజా -A తో బాధపడుతున్నట్లుగా తెలియజేశారు. ఈ క్రమంలోనే తాను మ్యూజిక్ షోలు కూడా చేయలేకపోతున్నానంటూ ఈ వీడియోలో వెల్లడించారు. దీంతో అభిమానులకు సైతం క్షమాపణలు కూడా తెలియజేశారు.. తను గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారని అసలు మాట్లాడలేకపోతున్నానని జ్వరం దగ్గుతో ఇబ్బంది పడుతున్నారని కొద్దిరోజులు వైద్యులు తనని రెస్ట్ తీసుకోమన్నారని కూడా ఈ వీడియోలో తెలియజేశారు. తిరిగి ఆగస్టులో అన్ని రీ షెడ్యూల్ చేస్తాను తన ప్రోగ్రామ్స్ అంటూ ఈ వీడియో ద్వారా తెలిపారు నిక్ జోనస్..