2025లో బాలీవుడ్ కి ఫుల్ జోష్ ఇచ్చిన లేడీ ఓరియంటెడ్ మూవీ... 50 రోజులు అయినా థియేటర్లలో హంగామా..!

Pulgam Srinivas
టబు , కరీనా కపూర్ , కృతి సనన్ ప్రధాన పాత్రలో క్రూ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజీ నటీ మణులు అయినటువంటి టబు , కరీనా కపూర్ , కృతి ముగ్గురు నటించడంతో ఈ మూవీ కి మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అలాగే ఈ సినిమాకు మంచి టాక్ కూడా వచ్చింది. దానితో చిత్రానికి అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చాయి.
 

ఇకపోతే ఈ సినిమా విజయ వంతంగా 50 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. నిన్నటి తో ఈ సినిమా 50 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ 50 డేస్ నాన్ స్టాప్ అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఏ సినిమాలో టబూ , కరీనా కపూర్ , కృతి సనన్ ముగ్గురు కూడా తమ నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక 50 రోజులను పూర్తి చేసుకున్న కూడా ఈ సినిమా కొన్ని ప్రదేశాలలో మంచి కలెక్షన్ లను ఇప్పటికీ కూడా రాబడుతుంది.

రాజశేఖర్ ఏ  కృష్ణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి నిధి మెహ్రా , మేహుల్ సురి కథను అందించారు. ఇక ఈ మూవీ కి ఇండియాతో పాటు ఓవర్ సిస్ లో కూడా భారీ మొత్తంలో కలక్షన్ వచ్చాయి. ఇలా 50 రోజులు అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా భారీ కలెక్షన్ లను వసూలు చేస్తుంది అంటే మరికొన్ని రోజులు కూడా ఈ మూవీ కి డీసెంట్ కలెక్షన్ లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: