ప్లీజ్.. నన్ను పవన్ తో ముడి పెట్టొద్దు : రేణు దేశాయ్

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరు హీరోల్లా ఎక్కువ సినిమాలు చేయకపోయినా.. ఆయన వ్యక్తిత్వానికి ఎక్కువగాఅభిమానులు ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఏ విషయం తెరమీదకి వచ్చిన కూడా అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ పేరు కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ గా మారిపోతూ ఉంటుంది.

 పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇప్పుడు ఎవరి జీవితంలో వారు బిజీబిజీగానే ఉన్నారు   ఈ క్రమంలోనే రేణు దేశాయ్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఆమె ఏం చేసినా కూడా ఇక సోషల్ మీడియా జనాలు మొత్తం పవన్ కళ్యాణ్ తో ముడి పెడుతూ కామెంట్ చేస్తూ ఉండడం జరుగుతూ వస్తుంది. అయితే ఇలాంటివి చేయొద్దు అని రేణు దేశాయ్ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన కూడా ఇంటర్నెట్ జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.

 ఇటీవల జంతు సంరక్షణ కోసం విరాళాలు కోరుతూ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె పెట్టిన పోస్ట్ ని అటు పవన్ కళ్యాణ్ తో ముడిపెడుతూ ఇంటర్నెట్ జనాలు ఎన్నో రీపోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ లాగానే మా వదిన రేణు దేశాయ్ మనస్సు కూడా గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి కామెంట్లపై రేణు దేశాయ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు  తాను సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ విషయంలో.. తన మాజీ భర్తతో నన్ను ఎందుకు పోలుస్తారు అంటూ ఫైర్ అయ్యారు ఆమె. పదేళ్లుగా జంతు సంరక్షణ కోసం సహాయం చేస్తున్న దానికి నా మాజీ భర్తతో ఎలాంటి సంబంధం లేదు. నేను చేస్తున్న పనుల గురించి పోస్ట్ పెడితే.. ఇక ఆయన ప్రస్తావన ఎప్పుడు తీసుకు రాకండి అంటూ రిక్వెస్ట్ చేశారు రేణు దేశాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: