ఒక్క జట్టుకి ఇంతమంది కెప్టెన్లా.. ఇలా అయితే కష్టమే?

praveen
సాధారణంగా ఏ జట్టుకైనా సరే సారధి అనేవాడు ఎంతో ముఖ్యం. సారధి సమర్థుడు అయితే జట్టు ఎంతో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. ఎందుకంటే సారథి ఏం చెప్తే జట్టులోని ఆటగాళ్లు అందరూ కూడా అదే చేస్తారు. అందుకే ఇక సారధి వ్యూహాలు సరైనవి అయితే జట్టును విజయ తీరాల వైపుకు నడిపించడం ఎంతో సులభం. ఇది నిజమే అన్న విషయాన్ని ఇప్పటివరకు ఎన్నో టీమ్స్ కెప్టెన్లు కూడా నిరూపించారు. అయితే ఇక ఒక సారధి ఎక్కువకాలం కొనసాగితే ఇక ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే సారధి యొక్క మనస్తత్వాన్ని వ్యూహాలను ఆటగాళ్లు ఎంతో సులభంగా అర్థం చేసుకోగలరు.

 కానీ ఒక జట్టుకు సారథులు తరచూ మారుతూ ఉంటే జట్టులో ఆటగాళ్ల ఆలోచనల్లో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టులో ఇలాంటి పరిస్థితులను నెలకొన్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ కలవాలి అనే లక్ష్యంతో పంజాబ్ కింగ్స్ జట్టు  ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగింది. అయితే ధావన్ కొన్ని మ్యాచ్లకు కెప్టెన్సీ వహించగా ఆ తర్వాత గాయంతో తప్పుకున్నాడు. దీంతో ఇక ఆ జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న శ్యామ్ కరణ్ సారధ్య బాధ్యతలు చేపట్టాడు. అయితే ఇటీవల దేశం తరఫున ఆడాల్సి రావడంతో శ్యాంకరణ్ స్వదేశానికి వెళ్ళిపోయాడు.

 ఇంకేముంది ఒక్క సీజన్లోనే పంజాబ్ కింగ్స్ కి మరో కొత్త కెప్టెన్ వచ్చేసాడు. నేడు హైదరాబాద్ జట్టుతో జరగబోయే మ్యాచ్ కి పంజాబ్ కెప్టెన్ గా  జీతేష్ శర్మ వ్యవహరించబోతున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శ్యామ్ కరన్ స్వదేశం వెళ్లిపోవడంతో.. ఇక జితేష్ ఈ బాధ్యతలను చేపట్టబోతున్నాడు. కాగా ఈ ఐపీఎల్ సీజన్లో జితేష్ పూర్తిగా నిరాశపరిచాడు. 13 మ్యాచ్ లు ఆడి 155 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా ఇప్పటికే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. 13 మ్యాచులు అడి కేవలం ఐదు విజయాలు మాత్రమే సాధించింది. అయితే ఒక్క సీజన్లోనే ముగ్గురు కెప్టెన్లు మారడంపై అటు జట్టు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: