ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. కలిస్తే అలా చేస్తా : పాయల్

praveen
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా కొనసాగిన ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు తెలుగులో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ప్రభాస్ రేంజ్ ని అంతకంతకు పెంచుతూ వచ్చాయి. దీంతో ఇక ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని చులకనగా చూసిన బాలీవుడ్ బడా దర్శకులు సైతం ఇక ఇప్పుడు ప్రభాస్ లాంటి హీరోలతో సినిమాలు తీసేందుకు క్యూ కడుతున్నారు అని చెప్పాలి.

 అయితే ఆరడుగుల ఆజానుబావుడిగా ప్రభాస్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే డైలాగ్ అతనికి బాగా సెట్ అవుతూ ఉంటుంది. ఇక సిక్స్ ప్యాక్ బాడీ తో అమ్మాయిల కలల రాకమానుడిగా కొనసాగుతూ ఉంటాడు ప్రభాస్. అయితే చూడ్డానికి మాత్రమే ఇలా హెవీ బాడీతో ఉంటాడు. కానీ ప్రభాస్ మనసు మాత్రం వెన్న. మరి ముఖ్యంగా ప్రభాస్కి ఎంతో సిగ్గు కూడా. ఎవరితో మాట్లాడాలన్నా తెగ సిగ్గు పడిపోతూ ఉంటాడు. ఇక సినిమా ఫంక్షన్ లో మాట్లాడటానికి కూడా తెగ ఇబ్బంది పడుతూ ఉంటాడు.

 అయితే ఇలా ప్రభాస్ పైకి గంభీరంగా కనిపించిన అతని మనసు మాత్రం వెన్న అని ఎంతోమంది దర్శకులు అతనితో పని చేసిన నటీనటులు చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతోమంది హీరోయిన్లకు కూడా ప్రభాస్ ఫేవరెట్ గా ఉంటాడు. తనకు కూడా డార్లింగ్ ప్రభాస్ ఎంతో ఇష్టం అంటూ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ చెప్పుకొచ్చింది. ప్రభాస్ అంటే చాలా ఇష్టం. నేను ఆదివారాలను నా ప్రియమైన వారితో గడుపుతా. ప్రభాస్ కలిస్తే అతని కోసం నేనే స్వయంగా వంట చేస్తా డార్లింగ్ ఏది కోరితే అది. లేకుంటే నాకు ఇష్టమైన రాజ్మా రైస్ ని నేనే వండి ప్రభాస్కి తినిపిస్తా అంటూ ఒక ఇంటర్వ్యూలో అటు పాయల్ రాజ్ పుత్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: