చంద్ర బాబు: ఎల్లో మీడియా వల్లే అభాసుపాలు..!

Divya
ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఎక్కువగా కులాల వారిగానే ఓట్లు వేస్తూ ఉంటారు.. ముఖ్యంగా టిడిపి పార్టీ ఎప్పుడూ కూడా కుల పిచ్చితోనే వ్యవహరిస్తూ ఉంటుంది.. అలాగే రెడ్డి సామాజిక కూడా జగన్ సపోర్టుతోనే ఉంటుంది.ఇటీవలే సీఎం జగన్ తన కుమార్తెలు ఇద్దరు  లండన్ లో ఉండడం వల్ల పోలింగ్ అయిపోగానే రెండు రోజులు గ్యాప్ తో వెళ్లారు. ముఖ్యంగా అక్కడ తమ కుటుంబంతో రిలాక్స్ అవ్వాలని జగన్ ప్లాన్ చేసి వెళ్లడం జరిగింది.. దీంతో టీడీపీ సోషల్ మీడియా ఎల్లో బ్యాచ్ సైతం అదిగో జగన్ దేశం విడిచి పారిపోతున్నాడు ఇక రాడేమో అన్నట్లుగా పలు రకాలుగా ట్రోల్స్ కామెంట్స్ చేస్తూ వైరల్గా చేస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే విమానం ఏ రూట్లో వెళ్తుందో ఎక్కడెక్కడ ఆగుతుందో ఇదిగో ట్రాకింగ్ అంటూ కూడా పలు రకాల తప్పుడు ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నారా కుటుంబం నుంచి లోకేష్ తన ఫ్యామిలీతో ఇప్పటికే అమెరికాకు చేరిపోయారు. అది మాత్రం ఎవరికీ చెప్పరు  ఇటీవల చంద్రబాబు తన కుటుంబంతో కూడా యూఎస్ఏ కి వెళ్లారు. ఈ విషయాన్ని కూడా సైలెంట్ గానే దాచిపెట్టారు ఎల్లో మీడియా.. టిడిపి సోషల్ మీడియా.

చంద్రబాబు ఎందుకు వెళ్లారని ప్రశ్నలు రావడంతో హెల్త్ చెకప్ కు వెళ్తున్నారంటూ ఎల్లో మీడియా ఊదరగొడుతోంది.. అదే మరెవరైనా ఇలాంటి పరిస్థితులలో వెళితే అదిగో ఆంధ్ర అద్వానమైపోతోంది అందుకే అమెరికాకు చెక్ చేస్తున్నారనే విధంగా ట్రోల్ చేస్తూ ఉంటారు.. ఎల్లో మీడియాకు చంద్రబాబు పార్టీ నేతలు కుటుంబ సభ్యులు ఏం చేసినా కూడా కమ్మగానే ఉంటుంది. కానీ జగన్ మాత్రం ఏం చేసిన తప్పుగానే చూపిస్తూ ఉంటారు.. జగన్ విదేశీ పర్యటన గురించి మళ్లీ డిస్కషన్లు కూడా పెడుతూ ఉంటారు.. కానీ ఏనాడు కూడా చంద్రబాబు మీదకానీ.. ఆయన కొడుకు లోకేష్ మీద కానీ ఇలాంటి డిస్కర్షన్లు పెట్టారు.. కేవలం చంద్రబాబు గొప్పలు చెప్పడానికే ఎల్లో మీడియా ఉందంటూ చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: