ఆ ఒక్క మూవీ తప్ప నన్ను అన్ని నిరుత్సాహపరిచాయి... సుధీర్ బాబు..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమంలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి సుధీర్ బాబు తాజాగా హరోం హర అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో సుధీర్ బాబు వరుసగా టీవీ షో లలో , ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈయన మహేష్ బాబు తో సినిమా చేయడం గురించి , అలాగే తాను చేసిన సినిమాలు తనకు ఎలాంటి సంతృప్తిని ఇచ్చాయి అనే వివరాలను క్లియర్ గా చెప్పుకొచ్చాడు.

తాజాగా సుధీర్ బాబు ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... మహేష్ బాబు తో కలిసి నటించాలని నాకు ఉంది. ఆయనతో కలిసి ఒక సినిమా చేయడానికి ఎంతో కాలంగా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఏదో ఒక రోజు మహేష్ బాబు , నేను కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీ చేసే అవకాశం ఉంది అని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన నా కెరియర్ లో ప్రేమ కథ చిత్రం అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మినహాయిస్తే నాకు ఏ సినిమా కూడా ఫలితాల విషయంలో అంత సంతృప్తిని ఇవ్వలేదు. మిగతా సినిమాలు అన్నీ కూడా నన్ను నిరుత్సాహ పరిచాయి అని అన్నారు.

కమర్షియల్ గా బెటర్ గా ఉండవలసిన చిత్రాలను ప్రేక్షకులకు చేరువ చేయడంలో నేను ఫెయిల్ అయ్యాను అని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే సుధీర్ బాబు కొంత కాలం క్రితం హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందిన మామ మచ్చింద్ర అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ సుధీర్ కు అపజయాన్నే అందించింది. మరి హరోం హరా సినిమాతో సుధీర్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: