"వార్ 2" అదిరిపోయే యాక్షన్ సన్నివేశం.. ఇద్దరు హీరోలపై అలా ప్లాన్ చేసిన మేకర్స్..?

MADDIBOINA AJAY KUMAR
ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ కి గ్లోబల్ గా క్రేజ్ దక్కింది. దానితో ఎన్టీఆర్ , హృతిక్ హీరోలుగా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి. కియార అద్వానీ ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ సినిమాలో ఓ భారీ ఐటమ్ సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేసినట్లు , అందులో బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి కత్రినా కైఫ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇండియాలోనే ఎన్టీఆర్ , హృతిక్ గొప్ప డాన్సర్ లుగా పేరు తెచ్చుకున్నారు. అలాగే కత్రినా కూడా డాన్స్ బాగానే చేస్తుంది. ఇలా వీరు ముగ్గురు మంచి డాన్సర్ లు కావడంతో వీరిపై ఒక అదిరిపోయే మాస్ బీట్ స్టెప్ లను కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రధానంగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ లో అనేక యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి. ఈ మూవీలోని ఒక యాక్షన్ సన్నివేశాన్ని మాత్రం అదిరిపోయి రేంజ్ లో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో ఎన్టీఆర్ మరియు హృతిక్ ఇద్దరూ కూడా తలపడబోతున్నట్లు , ఆ సన్నివేశంలో వీరిద్దరూ కూడా షర్టు లేకుండా తమ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నట్లు , ఇలా వీరిద్దరూ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తూ చేయబోయే ఆ ఫైట్ ను సూపర్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ ఏ మూవీ తోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఎన్టీఆర్ క్రేజ్ హిందీ సినీ పరిశ్రమలో మరింత పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: