"రామయ్య వస్తావయ్య" మూవీకి మొదట అనుకున్న కథ ఏంటో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం రామయ్య వస్తావయ్య అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమలు అయినటువంటి సమంత , శృతి హాసన్ హీరోయిన్ లుగా నటించగా , ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా , టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఎన్టీఆర్ హీరోగా నటించడం హరీష్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించడం , ఇందులో సమంత , శృతి హాసన్ హీరోయిన్ లుగా నటించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఫ్లాప్ మూవీ లో లిస్టులో చేరిపోయింది. ఇలా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కావడంతో ఆ సినిమా విడుదల అయిన తర్వాత చాలా కాలానికి దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా కోసం అనుకున్న కథ అది కాదు అని మొదట ఓ కథ కోసం చాలా రోజులు పని చేసాం అని చెప్పుకొచ్చాడు.

అసలు విషయం లోకి వెళితే ... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్న తర్వాత హరీష్ ఓ కథను రెడీ చేశాడు. అంతా కంప్లీట్ అయిన తర్వాత రెబల్ మూవీ రిలీజ్ అయ్యింది. మేము ఎన్టీఆర్ కోసం అనుకున్న కథ , రెబల్ మూవీ కథ దాదాపుగా దగ్గరగా ఉండడం రెబల్ మూవీ ఫ్లాప్ కావడంతో మేము ఆ కథ బాగుండదు అని వేరే దాన్ని తయారు చేశాం. అదే రామయ్య వస్తావయ్య. కానీ ఆ కథ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dr

సంబంధిత వార్తలు: