"సుడిగాలి 2" గురించి ఆఫీసర్ అనౌన్స్మెంట్ ఇచ్చేసిన అల్లరి నరేష్..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న నటులలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో కామెడీ ఓరియంటెడ్ మూవీ లలో , అలాగే ఎన్నో సీరియస్ మూవీ లలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో పొడుగు కాళ్ళ సుందరి పరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈచిత్ర బృందం వరుస ఇంటర్వ్యూ లలో , టీవీ షో లలో పాల్గొంటూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

ఇక ఈయన తాజా ఇంటర్వ్యూ లో భాగంగా తన తదుపరి మూవీ ల గురించి తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ... త్వరలోనే సుడిగాడు 2 మూవీ చేయబోతున్నట్లు , ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వరకు జరుగుతున్నట్లు మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టి 2025 లో సుడిగాలి 2 మూవీ ని విడుదల చేయనున్నట్లు అల్లరి నరేష్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే సుడిగాడు సినిమాలో అల్లరి నరేష్ హీరోగా నటించగా , మోనాల్ గజ్జర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ కి భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా అప్పటి వరకు అల్లరి నరేష్ కెరీర్ లో ఏ సినిమా సాధించని స్థాయి కలెక్షన్ లను ఈ మూవీ సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: