ఆ ఇద్దరు నాకు థాంక్స్ చెప్పాలి... కరీనా కపూర్..!

MADDIBOINA AJAY KUMAR
బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన నటి మానులలో కరీనా కపూర్ ఒకరు. హిందీ పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని కరీనా చాలా సంవత్సరాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ స్టార్ హీరోల సరసన సినిమాల్లో ఎక్కువగా నటించలేకపోతున్నప్పటికీ పరవాలేదు అనే స్థాయి ఉన్న హీరోల సరసన నటిస్తూ కెరియర్ ను మంచి జోష్ లోనే ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

అందులో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన జంట అయినటువంటి రన్వీర్ సింగ్ , దీపికా పదుకొనే తనకు థాంక్స్ చెప్పాలి అంటూ చెప్పుకొచ్చింది. అసలు కరీనా కపూర్ కి వారిద్దరూ ఎందుకు ఛాన్స్ చెప్పాలి అని ఈ ముద్దుగుమ్మ అంది అనే విషయాలను తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం సంజయ్ లీలా బాన్సాలి దర్శకత్వంలో రూపొందిన రామ్ లీలా సినిమాలో రన్వీర్ సింగ్ ,  దీపికా పదుకొనే హీరో , హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతోనే వీరిద్దరి ప్రేమ కథ మొదలైంది. అలా చాలా కాలం పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ కొంత కాలం క్రితమే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఎంతో ఆనందంగా తమ సంసార జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు.

దానితో తాజా ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ ... రామ్ లీలా సినిమాలో మొదట దీపిక పాత్ర ఆఫర్ నాకు వచ్చింది. కానీ ఆ సమయంలో నేను ఇతర మూవీ లతో బిజీగా ఉండడం వల్ల ఆ పాత్రను రిజెక్ట్ చేశాను. ఆ తర్వాత దర్శకుడు దీపికాను ఆ పాత్రకు సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ కారణం గానే వారిద్దరికీ ప్రేమ పుట్టింది. వారు పెళ్లి కూడా చేసుకున్నారు. అందుకే ఆ ఇద్దరు నాకు థాంక్స్ చెప్పాలి అని కరీనా కపూర్ తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: