నాని సినిమాల ప్లానింగ్ కి సలాం?

Purushottham Vinay
ప్రస్తుతం నాని సినిమా అంటే చాలు మినిమం గ్యారెంటీ అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో ఏర్పడింది. అంతేకాదు దసరా సినిమాతో తనని తక్కువ అంచనా వేసిన అందరికీ రీ సౌండ్ వినిపించేలా చేసిన నాని ప్రస్తుతం అదే ఫాం కొనసాగిస్తున్నాడు. దసరా సినిమా తర్వాత నాని క్లాస్ మూవీ హాయ్ నాన్నతో కూడా మంచి ఫలితాన్ని అందుకున్నాడు.ఆ సినిమా దసరా రేంజ్ లో వసూళ్లు రాబట్టలేకపోయినా అంతకమించి మంచి పేరుని రాబట్టింది. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో కూడా పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు నాని. ఆగష్టు ఎండింగ్ లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా తర్వాత నాని యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో సినిమా లాక్ చేశాడు. సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న OG పూర్తి చేశాక నాని సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.మరోపక్క నాని మరోసారి దసరా కాంబోని రిపీట్ చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెలతో నాని సెకండ్ అటెంప్ట్ చాలా భారీగా ఉండేలా చూస్తున్నాడు.


ఈ క్రమంలో రీసెంట్ గా దసరా కాంబో కలిసి చేస్తున్న సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా వచ్చింది. ఈసారి కూడా నాని మాస్ అవతార్ తో ఆడియన్స్ ని ఖచ్చితంగా సర్ ప్రైజ్ చేయనున్నాడు. ఈసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో శ్రీకాంత్ ఓదెల నాని సినిమా ఉంటుందని సమాచారం తెలుస్తుంది.సుజిత్ సినిమా కనుక లేట్ అయితే శ్రీకాంత్ ఓదెలతోనే సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు నాని. ఈ మూవీ ను సెప్టెంబర్ లో అలా మొదలు పెట్టి మళ్లీ దసరా రిలీజ్ టైం లోనే అదే మార్చ్ ఎండింగ్ లోనే సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఈ మూవీ కోసం భారీ సెట్స్ ఇప్పటి నుంచే ఏర్పాటు చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది. దసరా 2 దసరా కాదు అంతకుమించి ఉండేలా చూస్తున్నారు నాని. నాని మరోసారి తన నట విశ్వరూపంతో ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తాడని చెప్పొచ్చు. శ్రీకాంత్ ఓదెల సినిమాను మార్చ్ లో రిలీజ్ చేసే ప్లానింగ్ తో భాగంగా సుజిత్ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో మొదలైనా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట నాని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: