మనమే మూవీ "టీజర్" అప్డేట్ వచ్చేసింది..!

MADDIBOINA AJAY KUMAR
ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి శర్వానంద్ ప్రస్తుతం "మనమే" అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ శర్వానంద్ కెరీర్ లో 35 వ మూవీ గా రూపొందుతుంది. హేషం అబ్దుల్ వాహబ్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఒక చిన్న వీడియోని విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. అలాగే ఈ మూవీ బృందం వారు "ఇక నా మాటే" అంటూ సాగే ఒక పాటను కూడా విడుదల చేశారు. దీనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా టీజర్ అప్డేట్ కు సంబంధించిన విషయాన్ని ప్రకటించారు.

తాజాగా ఈ మూవీ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య టీజర్ రిలీజ్ అప్ డేట్ ని అందించారు. తమ మూవీ యొక్క టీజర్ అప్ డేట్ ని ఏప్రిల్ 18 వ తేదీన ఉదయం 10 గం. ల 8 ని. లకు అందించనున్నట్లు శ్రీరామ్ ఆదిత్య తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీ ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

కొంత కాలం క్రితం వరకు వరుస ఫ్లాప్ లతో డీలా పడిపోయిన శర్వానంద్ "ఒకే ఒక జీవితం" అనే మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. మరి మనమే సినిమాతో ప్రేక్షకులను శర్వానంద్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో ..? ఈ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: