మరోసారి సంక్రాంతికి తలపడనున్న చిరు... బాలయ్య..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు కూడా తమ కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు వీరి కెరియర్ లో చాలా సందర్భాలలో వీరు నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడిన సందర్భాలు ఉన్నాయి. చిరంజీవి కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో రాజకీయాల వైపు దృష్టి సారించి ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

చిరు హీరోగా రూపొందిన ఖైదీ 150  ,బాలకృష్ణ హీరోగా రూపొందిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలు రెండు కూడా 2017 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యాయి. ఇందులో భాగంగా ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇకపోతే 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి ... చిరంజీవి హీరోగా రూపొందిన వాల్టేరు వీరయ్య సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

ఇకపోతే మరోసారి కూడా ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతికి పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇక బాలయ్య , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే విశ్వంభర మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇక బాలయ్య , బాబీ కాంబోలో రూపొందుతున్న సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలోనే నిలపబోతున్నట్లు తెలుస్తోంది. ఇది నిజం అయితే మరోసారి చిరు , బాలయ్య సినిమాలు సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ దగ్గర తలబడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: