ఆ తేదీ నుండి "ఓటిటి" లో "ది ఫ్యామిలీ స్టార్"..?

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా "ది ఫ్యామిలీ స్టార్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు . ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... పరుశురామ్ పేట్లా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు మూవీ ని నిర్మించగా ... గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు . గతంలో విజయ్ , పరుశురామ్ కాంబో లో రూపొందిన గీత గోవిందం సినిమా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ పై మొదటినుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ మొత్తంలో కలెక్షన్ లను వసూలు చేయలేక పోతుంది. ఈ సినిమాకు పెద్ద మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ... ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ విజయ్ కెరియర్ లో మరో ఫ్లాప్ మూవీ అయ్యే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి.

ఇకపోతే ఇప్పటి వరకు థియేటర్ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా మే 3 వ తేదీ నుండి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd

సంబంధిత వార్తలు: