డిసెంబర్ 20వ తేదీన ఏకంగా మూడు సినిమాలు... అవేంటో తెలుసా..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువ సెలవు దినాలు ఎక్కువ ఉన్న సమయంలో అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. దానితో కొన్ని సినిమాలకు భారీ ఎత్తున థియేటర్ లు దొరికితే మరికొన్ని సినిమాలకు పెద్ద స్థాయిలో థియేటర్ లు దొరకవు. అయినప్పటికీ సినిమాకు మంచి టాక్ వచ్చినట్లు అయితే సెలవు దినాలు ఎక్కువగా ఉండడంతో కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో పోటీలో అయినా సరే సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన కూడా మూడు క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది అవి ఏవో తెలుసుకుందాం.
టాలీవుడ్ యువ నటుడు నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండెల్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి చందు మండేటి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అల్లు అరవింద్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ముఫస : ది లయన్ కింగ్ అనే మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీ ని కూడా డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇలా ఈ మూడు మూవీ లు కూడా ఒకే తేదీన విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. మరి ఇందులో ఏ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: