ఎన్టీఆర్ వార్ 2 లుక్ ని రివీల్ చేసిన ఊర్వశి రౌతేలా?

Purushottham Vinay
స్పెషల్ సాంగ్స్ ద్వారా బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.బాలయ్య బాబీ  సినిమాలో కూడా ఊర్వశి రౌతేలా నటిస్తున్నారని తెలుస్తోంది.సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఊర్వశి రౌతేలా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.జిమ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఊర్వశి జూనియర్ ఎన్టీఆర్ మన ప్రియమైన, నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్ అని ఆమె పేర్కొన్నారు.జూనియర్ ఎన్టీఆర్ క్రమశిక్షణతో నిజాయితీగా వినయపూర్వకంగా ఉండే వ్యక్తి అని ఊర్వశి చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ దయ, ప్రేరణకు కోటి ధన్వవాదాలు అని ఊర్వశి కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సింహం లాంటి వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం అని ఊర్వశి పేర్కొన్నారు.


రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేసే అవకాశం కోసం వేచి ఉండలేకపోతున్నా అని ఊర్వశి అన్నారు.తారక్, ఊర్వశి రౌతేలా యాదృచ్ఛికంగా కలిశారా? లేక ఏదైనా సినిమా కోసం కలిశారా అనే ప్రశ్నలకు జవాబు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఎన్టీఆర్ లుక్ వార్ 2 సినిమాలోదే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. వార్2 సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన తారక్ త్వరలో దేవర సినిమా షూట్ లో పాల్గొననున్నారు. తారక్, జాన్వీ  కాంబినేషన్ లో సాంగ్స్ షూట్ చేయాల్సి ఉందని సమాచారం తెలుస్తుంది. మరోవైపు వార్2 సినిమాలో త్రిప్తీ దిమ్రీ కూడా నటిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానమని తారక్ తో నటించి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని ఈ బ్యూటీ పలు సందర్భాల్లో వెల్లడించగా తక్కువ సమయంలోనే ఆమె కోరిక నెరవేరిందని కామెంట్లు బాగా వినిపిస్తున్నాయి. వరుస ప్రాజెక్ట్ లతో ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ న్యూ లుక్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. /

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: