శ్రీదేవి బయోపిక్ పై బోనికపూర్ సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja

ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్స్ సీజన్ కొనసాగుతోంది. దీనితో కొంతమంది సంచలన వ్యక్తుల జీవితాలు కొన్ని సంచలన సంఘటనల ఆధారంగా సినిమాలు తీసి ఘన విజయం సాధిస్తున్నారు. ఈపరిస్థితుల నేపధ్యంలో ఒకనాటి అందాల నటి శ్రీదేవి జీవితం పై బయోపిక్ ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తీయబోతోంది అని వస్తున్న వార్తల పై ఆమె భర్త బోనీకపూర్ ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తాను జీవించి ఉండగా శ్రీదేవి జీవితం పై ఎంతటి ప్రముఖ నిర్మాణ సంస్థ బయోపిక్ తీయడానికి ప్రయత్నించినా తాను అంగీకరించనని శ్రీదేవి జీవితంలోని సంఘటనలు ప్రచారంలోకి తీసుకు వచ్చి దానిని వ్యాపారంగా మార్చడానికి తాను ఎట్టి పరిస్థితులలో అంగీకరించనని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు శ్రీదేవి చాల రిజర్వ్డ్ వ్యక్తి అనీ ఆమె జీవించి ఉన్న రోజులలోనే మీడియాకు చాల దూరంగా ఉండేదని అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి జీవితంలోని కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని కొన్ని గాసిప్పు వార్తలను ఆధారంగా చేసుకుని సినిమాలు తీస్తాము అంటే తాను ఎలా అంగీకరిస్తాను అని అంటున్నాడు.

అంతేకాదు శ్రీదేవికి తన కూతుళ్లను ఇద్దరినీ ఫిలిమ్ ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసించే విధంగా టాప్ హీరోయిన్ ల స్థాయికి తీర్చి దిద్దాలని తన ప్రయత్నం అంటూ బోనీ కపూర్  చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. శ్రీదేవి దుబాయ్ లోని ఆమె రూమ్ బాత్ రూమ్ లో పడి చనిపోయినప్పుడు ఆమె భర్త బోనీకపూర్ ను అనుమానిస్తూ దుబాయ్ మీడియా సంస్థ అనేక ఊహాగానాలు అనేక సందేహాలు వ్యక్తపరిచిన సమయంలో ఆమె భర్త బోనీకపూర్ పై కూడా కొన్ని మీడియా సంస్థలు అనేక ఊహాగానాలు ప్రచారంలోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే అప్పట్లో ఆ గాసిప్పుల పై స్పందించడానికి బోనీ కపూర్ ఆశక్తి కనపర్చలేదు. అయితే ఆ గాసిప్పులను ఆధారంగా తీసుకుని శ్రీదేవి బయోపిక్ తీయడానికి రానున్న రోజులలో బోనీకపూర్ మనసు మార్చుకుని సహకరిస్తాడో లేదో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: