మీర్జాపూర్ 3: మున్నా భయ్యా మళ్ళీ వస్తాడా..?

murali krishna
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకోగా రెండు సీజన్ లు అద్భుతమైన విజయం సాధించాయి.. ప్రస్తుతం మీర్జాపూర్ నుంచి మూడో సీజన్‍ను అమెజాన్ ప్రైమ్ వీడియో  ఎప్పుడెప్పుడు తీసుకొస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇటీవలే  మీర్జాపూర్ సీజన్ 3 గురించి అమెజాన్ ప్రైమ్ వీడియో ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది.త్వరలోనే మీర్జాపూర్ మూడో సీజన్ వస్తుందని హింట్ ఇచ్చింది. అయితే, సీజన్ 2 చివర్లో మరణించిన మున్నా భయ్యా మళ్లీ మూడో సీజన్‍లో కనిపిస్తాడా లేదా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దివ్యేందు పోషించిన మున్నా భయ్యా పాత్ర మీర్జాపూర్ సీజన్ 2 చివర్లో చనిపోతుంది. అయితే, మున్నా నిజంగా చనిపోయాడా.. దీని వెనుక మిస్టరీ ఏమైనా ఉందా అంటూ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో దివ్యేందు ఫొటోతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. హిందీ సినిమాల్లో హీరోను ఎవరూ చంపలేరంటూ దాని సారాంశంగా ఉంది. దీంతో మూడో సీజన్‍లో మున్నా భయ్యా కనిపిస్తాడన్న చర్చ మొదలైంది..అయితే, ఈ విషయంపై మున్నా భయ్యా పాత్ర చేసిన దివ్యేందు తాజాగా స్పందించారు. మీర్జాపూర్ మూడో సీజన్‍లో మున్నా భయ్యా పాత్ర ఉండదని దివ్యేందు తాజాగా వెల్లడించారు.హ్యూమన్స్ ఆఫ్ బాడీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యేందు ఈ విషయంపై స్పందించారు. సీజన్ 2 చివర్లో చనిపోయినా మున్నా పాత్ర మళ్లీ మూడో సీజన్‍లో తిరిగి రాదని దివ్యేందు వెల్లడించారు.మున్నా భయ్యా పాత్ర ఉండదని దివ్యేందు చెప్పినా కూడా ఈ విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది నిజమేనా.. కావాలనే దీన్ని సీక్రెట్‍గా ఉంచుతున్నారా అనే సందేహాలు ప్రేక్షకులలో మొదలయ్యాయి..మూడో సీజన్‍లో మున్నా భయ్యా ఎంట్రీ బిగ్ సర్ ప్రైజ్ దాగి ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: