మరి కొద్ది గంటల్లో మాస్ జాతర.. పుష్ప రాజ్ పోస్టర్ అదిరిందిగా..!!

murali krishna
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.పాన్ ఇండియా ప్రేక్షకులంతా ఈ మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన అల్లుఅర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్..  రష్మిక ఫస్ట్ లుక్ అలాగే ఫహాద్ లుక్ సినిమా పై అంచనాలు భారీగా పెంచేసాయి.. ఎన్నో రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. కానీ ఇప్పటివరకు టీజర్ రాలేదు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ రివీల్ చేస్తారా అని వెయిట్ చేస్తున్న అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే కు మేకర్స్ స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు. ఈరోజు (ఏప్రిల్ 8న) అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పుష్ప 2 మూవీ నుంచి వరుస అప్డేట్స్ రివీల్ చేస్తూ మేకర్స్ సర్ ప్రైజ్ ఇస్తున్నారు. ఈరోజు పుష్ప 2 ది రూల్ టీజర్ రిలీజ్ చేయనున్నారు. 

ఈ క్రమంలో  పుష్ప 2 నుంచి వరుసగా పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. పుష్ప 2 టీజర్ పై అప్డేట్ ఇస్తూ మేకర్స్ రివీల్ చేసిన అల్లుఅర్జున్ పోస్టర్ అదిరిపోయింది. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ ఈరోజు ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. బన్నీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సింహాసనంలో అల్లుఅర్జున్ కుర్చొని ఉండగా.. కుడి చేతిలో గొడ్డలి పట్టుకుని కుర్చున్న పోజ్ ఈసారి మరింత మాస్ యాక్షన్‏తో అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది.తాజా లుక్ లో పుష్ప రాజ్ స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఏలేందుకు సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది. ఇక అల్లుఅర్జున్ వెనుక ఉన్న సైన్యం కూడా మాసీవ్ గా కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఈ మాస్ జాతర ఎలా ఉండబోతుందో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: