"పుష్ప 2" నుంచి బిగ్ అప్డేట్.. వైరల్ అవుతున్న రష్మిక పోస్టర్..!!

murali krishna
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ భామ ఛలో సినిమా తో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు లో మొదటి సినిమాతోనే రష్మిక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తరువాత వరుస సినిమాలలో ఆఫర్స్ అందుకుంది. అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా లో శ్రీవల్లి పాత్ర లో రష్మిక అదరగొట్టింది.పుష్ప మూవీ పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పుష్ప సినిమా తో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందింది.నార్త్ టు సౌత్ బడా హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటుంది.

చి
వరిగా ఈ భామ 'యానిమల్' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది...యానిమల్ మూవీ పాన్ ఇండియా స్థాయి లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీనితో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. యానిమల్ సినిమా లో రష్మిక యాక్టింగ్ ఇరగదీసింది... ఇక త్వరలో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 తో రష్మిక ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. ఇక నేడు రష్మిక పుట్టినరోజు కావడం తో పుష్ప 2 టీం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీ నుంచి రష్మిక క్రేజీ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు..పుష్ప సినిమాలో రష్మికను గ్లామర్ లెస్ గా చూపించారు.పుష్ప 2 లో మాత్రం రష్మికను ఎంతో గ్లామరస్ గా చూపించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.పుష్ప 2 మూవీ ఈ ఏడాది ఆగష్టు 15 న విడుదల కాబోతుంది..పుష్ప ను మించి పుష్ప 2 మూవీ ఉంటుందని ఇటీవల దర్శకుడు సుకుమార్ తెలిపారు. అలాగే పుష్ప 3 కూడా ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: