ముందు లైట్.. తర్వాత టైట్.. ఇప్పుడు డౌట్.. గురజాల వైసీపీలో కలకలం..!
అయితే.. చెట్టు పేరు చెప్పుకొన్న నేపథ్యంలోనే గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారని.. ఆయన వర్గం నేతలే ఆరోపిస్తుంటారు. ఇక, ఇప్పుడు కూడా మరోసారి వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. కానీ, చిత్రం ఏంటంటే.. గత ఎన్నికల్లో ఉన్న బలం లేదు. గత ఎన్నికల సమయంలో జై కొట్టిన నాయకులు లేరు. పైగా.. వారసత్వం.. చెట్టు పేర్లు వంటివి అప్పటితోనే సరి! ఇప్పుడు కూడా ఇదే మాట చెబుతామంటే కుదరదు. ఐదేళ్లలో ఆయన గురజాలకు చేయాల్సింది చేయకుండా పిండాల్సింది మాత్రం బాగానే పిండేశారని వైసీపీ వాళ్లే చెపుతున్నారు. దీంతో కాసు పరిస్థితి డోలాయమానంలో పడింది.
ఇవన్నీ ఇలా.. ఉంటే.. వాస్తవానికి కీలకమైన నాయకుడు జంగా కృష్ణమూర్తి వైసీపీ నుంచి వెళ్లిపోయినప్పు డు.. కాసు ఏమనుకున్నారంటే.. ఆ ఏముంది.. ఎంతో మంది వస్తారు.. ఎంతో మంది పోతారు.. అని! అంటే.. అప్పట్లో లైట్ తీసుకున్నారు. అసలు వైసీపీలో కాసు ఎక్కడ ? జంగా ఎక్కడ ? జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి 2014 ఎన్నికల్లో ఓడిపోయి 2019 వరకు కాసు అడ్రస్ లేరు. 2019 ఎన్నికల్లో గెలిచి మరీ బలమైన బీసీ నేతను ఘోరంగా అవమానించి పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేశారని ఆ వర్గాలు రగులుతున్నాయి.
ఇక, ఈ ఫలితం ఎలా ఉంటుందనేది ఆయన రోడ్డెక్కితే కానీ.. తెలియలేదు. జంగా లేని లోటు తర్వాత తర్వాత.. తెలిసి వచ్చింది. పైగా.. ఆయన పోయి పోయి బలమైన ప్రత్యర్థి యరపతినేని శ్రీనివాసరావుకు జైకొట్టారు. దీంతో అసలు కాక తెలిసి వచ్చింది. దీంతో కాసు.. తర్వాత.. రోజుల్లో గెలుపు టైట్`అనుకున్నారు. ప్రయాస పడి పోరాటం చేస్తే.. గెలవచ్చని కొడికడుతున్న దీపానికి ఆశల చమురు పోసుకున్నారు. కట్ చేస్తే.. ఎన్నికలు సమీపిస్తుండడం.. కూటమి తరఫున మేనిఫెస్టో తో సహా.. యరపతినేని ఇచ్చిన సొంత మేనిఫెస్టో కూడాప్రజల్లో బలంగా ఉండడంతో ఇప్పుడు కాసు నోట ``డౌట్` మాట వినిపిస్తోంది. ఇదీ.. పరిస్థితి. అంటే.. మొత్తంగా ముందు లైట్.. తర్వాత టైట్.. ఇప్పుడు డౌట్-ఇదీ కాసు మహేష్‌రెడ్డి పరిస్థితి.