రిజర్వేషన్లు: కాంగ్రెస్‌ ట్రాప్‌లో మోడీ, అమిత్‌షా పడిపోయారా?

ఇదిగో పులి అంటే అదిగో తోక ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. లోక్ సభ ఎన్నికల వేళ సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ లో ఉంది. పార్టీల పనుల కోసం ఏకంగా ప్రత్యేకంగా బృందాలనే నడుపుతున్నాయి. తమ నాయకుడి ప్రచారంతో పాటు ప్రత్యర్థిపై బురద చల్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.

ఇందుకోసం నకిలీ వీడియోలు సృష్టించి.. వాటిని సోషల్ మీడియాలో వదులుతున్నారు. అవి చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నిజాన్ని తలదన్నేలా ఉండటం.. వీడియోలు, ఫొటోలను జత చేయడంతో పాటు ఇవి నిజమని నమ్మే పరిస్థితిని సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీసేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఈ తరహా ఎత్తుగడలకు తెరతీశారు. తాజాగా కేంద్ర హోం మంత్రి మాట్లాడిన మాటలనే వక్రీకరించి  సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

వాస్తవానికి అమిత్ షా ఏం మాట్లాడారు అంటే ముస్లిం రిజర్వేషన్లకు ఏపీ ప్రయోగశాలగా మారింది. అందువల్ల మేం అధికారంలోకి వస్తే వీటిని రద్దు చేసి బీసీ, ఎస్సీ,ఎస్టీలకు వీటిని కేటాయిస్తాం అని ప్రకటించారు. కానీ వీటిని కొంతమంది తెలివిగా బీసీ,ఎస్సీ, ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీజేపీ ఈ సారి అధికారంలోకి వస్తే రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా ఎత్తి వేస్తుందని.. కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయడం మొదలు పెట్టారు.

దీంతో బీజేపీ ఢిఫెన్స్ లో పడిపోయింది. ఇప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కాషాయ అగ్ర నేతలు ఎక్కడికి వెళ్లినా మేం రిజర్వేషన్లు తొలగిస్తామని అనలేదు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ప్రకటించలేదు అంటూ పాల్గొన్న ప్రతిసభలోను చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పి ఎస్సీ,ఎస్టీ, బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తే.. మొత్తానికే రిజర్వేషన్లు రద్దు చేస్తారు అని కాంగ్రెస్ వారిపైకే ఆ బాణాన్ని సంధించింది. దీంతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: