పాముకాటుతో వ్యక్తి మృతి.. బ్రతికొస్తాడని గంగా నది ప్రవాహంలో ఉంచారు.. చివరికి?

praveen
ప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంటే.. కొన్ని ప్రాంతాలలో మాత్రం జనాలు మూఢనమ్మకాలు మాయలోనే ముందుకు తేలుతూ ఉన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని ఇంకా గుడ్డిగా నమ్ముతున్న జనాలు అక్కడక్కడ కనిపిస్తున్నారు. సాధారణంగా ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ బ్రతకడం చాలా కష్టం. ఇక ఎప్పుడో ఒకసారి అదృష్టం కొద్దీ చనిపోయిన వ్యక్తి మళ్ళీ బ్రతకడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది ఏకంగా పూజలు చేస్తే మనిషిని మళ్లీ బ్రతికించవచ్చు అని ఇక మూఢనమ్మకాలను ఇంకా నమ్ముతున్నారు.

 ఇటీవలే ఉత్తర ప్రదేశ్ లోని బలంద్ షహర్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అతను పాముకాటుకు గురై మరణించాడు. అయితే చనిపోయిన తర్వాత తన కొడుకు మళ్లీ బతికి వస్తాడని.. అతని తల్లి ఎంతో నమ్మకం పెట్టుకుంది. అయితే గంగా నదిలో రెండు రోజులపాటు ఇలా చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఉంచింది అని చెప్పాలి. అయితే చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాడు అన్న విషయం తెలిసినప్పటికీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ తల్లిని ఆపకపోవడం గమనార్హం. అయితే ఇలా గంగా నది ప్రవాహంలో మృతదేహాన్ని ఉంచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 ఇలా రెండు రోజులు కాదు మృతదేహాన్ని వేలాడదీసినప్పటికీ ఇక అతనిలో ఎలాంటి చలనం లేదు. ఇలా రెండు రోజులుగా యువకుడి శరీరంలో ఎలాంటి చలనం లేకపోవడంతో చివరికి అతనిని బయటకు తీసి దహనం చేశారు. ఏప్రిల్ 26వ తేదీన ఈ ఘటన జరిగింది అన్నది తెలుస్తుంది. 26 ఏళ్ల మోహిత్ కుమార్ ను ఇక పొలంలోకి వెళ్ళిన సమయంలో విషపూరిత పాము కాటేసింది. అయితే అతన్ని వెంటనే వైద్యులు వద్దకు తీసుకువెళ్లిన పరిస్థితి మెరుగుపడలేదు. ఒకరి సలహా మేరకు స్థానికంగా చికిత్స కోసం తీసుకెళ్లారు. దీంతో పాముకాటుకు గురైన వ్యక్తి మృత దేహాన్ని ప్రవహించే గంగా నదిలో ఉంచితే విషయం పోతుందని.. ఇక మళ్ళీ బ్రతికి వస్తాడని కుటుంబ సభ్యులకు చెప్పగా వాళ్ళు అతని మాటను గుడ్డిగా నమ్మారు. చెప్పినట్లుగానే గంగా నది ప్రవాహంలో మృతదేహాన్ని ఉంచారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే వైరల్ గా మారిపోయిన వీడియో చూసి నేటిజన్స్ ఇంకా మూఢనమ్మకాలను నమ్మడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: