ఈ సీటు వ‌న్‌సైడ్ బ్రో: గండం లేని వైసీపీ గురుమూర్తి ..!

RAMAKRISHNA S.S.
ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో నాయ‌కుల మ‌ధ్య పోరు తీవ్రంగా ఉంది. వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు భారీ ఎత్తున పోటీ ప‌డుతున్నారు. కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే.. ఈ పోరు మ‌రింత తీవ్రంగా ఉంది. అయితే.. కొన్ని కొన్ని చోట్ల మాత్రం పెద్ద‌గా పోటీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంటే.. ఆయా నియోజ‌క వ‌ర్గాల్లో  వార్ వ‌న్ సైడ్ అయ్యే సూచ‌న‌లే క‌నిపిస్తున్నాయి. వీటిలో వైసీపీకి క‌లిసి వ‌చ్చే స్థానాల‌తోపాటు.. కూట‌మి పార్టీల‌కు అనుకూలంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఉన్నాయి.

వీటిలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తిరుప‌తి పార్ల‌మెంటు. ఇక్క‌డ వార్ వ‌న్ సైడ్ అయిపోయింద‌ని ప‌రిశీల కులు చెబుతున్నారు. వైసీపీ నుంచి బ‌రిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ మ‌ద్దెల గురుమూర్తికి అనుకూలంగా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. కూట‌మి పార్టీల నుంచి బ‌రిలో ఉన్న వెల‌గ‌ల‌ప‌ల్లి వ‌ర‌ప్ర‌సాద్‌.. పెద్ద‌గా పోటీ ఇవ్వ‌లేక పోతున్నార‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. వ‌ర‌ప్ర‌సాద్‌.. బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది.

గ‌తంలో ఇక్క‌డ గెలిచి ఉండ‌డంతో ఆ ప్ర‌భావం ఏమైనా క‌నిపిస్తుంద‌ని బీజేపీ పెద్ద‌లు లెక్క‌లు వేసుకు న్నారు. కానీ, బీజేపీలోనే క‌లివిడి లేక‌పోవ‌డంతోపాటు.. టికెట్ ఆశించిన‌వారు ఆశాభంగానికి గురి కావ‌డం తో వ‌ర ప్ర‌సాద్ పోరులో నిల‌బ‌డ‌లేక త‌డ‌బ‌డుతున్నారు. మ‌రోవైపు వైసీపీ సిట్టింగ్ ఎంపీ గురుమూర్తికి ప‌రోక్షంగా ప్ర‌తిప‌క్ష పార్టీలు మ‌ద్ద‌తిస్తుండ‌డం విశేషం. ఎందుకంటే.. ఇక్క‌డ గురుమూర్తి వైరి ప‌క్షంలో ఉన్నా.. ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డే త‌త్వం లేని నాయ‌కుడు.. పైగా.. ఏదైనా ప‌నిపై వ‌చ్చినా.. నేనున్నా నంటూ ముందుకువ‌చ్చే టైపు. సో.. మొత్తంగా చూస్తే..తిరుప‌తి పార్ల‌మెంటు వ‌న్ సైడ్ అయిపోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇవీ బ‌లాబ‌లాలు....
వైసీపీ గురుమూర్తి:  సిట్టింగ్ ఎంపీ, వివాద ర‌హిత నాయ‌కుడు, జ‌నంలో ఈయ‌నైతేనే బెట‌ర్ అనే టాక్ వినిపించ‌డం. వైసీపీలో క‌లివిడి. డ‌బ్బు ఖ‌ర్చు లేక‌పోయినా.. గెలిచే నాయ‌కుడిగా పేరు. సొంత ఇమేజ్‌.

బీజేపీ వ‌ర‌ప్ర‌సాద్‌:  ఆయ‌న‌కో తిక్కుంది! అనే టాక్‌. వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రితోనూ క‌లివిడిగా ఉండ‌క‌పోవ‌డం. బీజేపీ కొత్త కావ‌డంతోపాటు.. ఎవ‌రూ స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం. ప్ర‌భుత్వంపై చేసే విమ‌ర్శ‌లు క‌లిసి రాక‌పో వ‌డం. ప్ర‌చారానికి కూడా ఆర్థిక ఇబ్బందులు అంటూ ప్ర‌క‌ట‌న చేయ‌డం. బీజేపీలో టికెట్ ఆశించిన వారు.. దూరంగా ఉండడం.

కాంగ్రెస్ చింతా మోహ‌న్‌:  కాంగ్రెస్ నుంచి బ‌రిలో ఉన్న చింతా మోహ‌న్ గెల‌వ‌క‌పోయినా.. ఆశావ‌హుల ఓట్లు బాగానే చీల్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: