చంద్రబాబు: రాజకీయంలో జగన్ లాంటి నాయకుడిని చూడలేదా..?

Divya
టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నది.. తన జీవితంలో మూడుసార్లు సీఎంగా మరో మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఎప్పుడు కూడా చంద్రబాబు తన రాజకీయ జీవితంలో జగన్ లాంటి వ్యక్తిని చూడలేదని.. అలాంటి వ్యక్తిని తాను ఎప్పుడూ ఊహించలేదని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు మాట్లాడిన మాటలు రాజకీయ విమర్శలు వంటివా..లేకపోతే జగన్ అందరి రాజకీయ నాయకుల మాదిరి లాంటి వ్యక్తి కాదు అనే చర్చ ఇప్పుడు మొదలైంది..

అయితే ఈ విషయంలో చంద్రబాబు చెప్పిన మాటలు ఏకీభవించాల్సిందే.. ఎందుచేత అంటే జగన్లాంటి పొలిటిషన్ ని మాత్రం చంద్రబాబు ఏ కాదు ఏపీ మాత్రమే కాదు దేశం మొత్తం కూడా ఎక్కడ చూడలేదని టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు,జగన్ మీద ఎన్నిసార్లు నెగిటివ్ అప్రోచ్ చేసిన .. వైసీపీ నేతలు మాత్రం పాజిటివ్ గానే అప్రోచ్ అవుతూ చాలా గొప్పలు చెబుతూ ఉంటారు.. అయితే ఎవరు ఎలా చెప్పినా కూడా పొలిటికల్ న్యూట్రల్ పరంగా మాత్రం జగన్ తీరు కాస్త వేరేగా ఉంటుందని అంగీకరించాల్సిందే.. ముఖ్యంగా ఆయన పట్టుదల ఎక్కువ అని సాధారణ రాజకీయ నాయకులకు కాస్త పట్టు విడుపు అనేది ఉంటుంది..

ముఖ్యంగా రాజకీయాలలో ఎప్పుడు విజయాలు అపజయాలు అనేవి వస్తూనే ఉంటాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి దివంగత వైయస్సార్ లో కూడా పట్టువిడుపు ఉన్నవి.. తెలుగు రాష్ట్రాలని పాలించిన సీఎంలు అందరికీ కూడా ఈ పట్టు విడుపు అంటే బాగా తెలుసు.. కానీ జగన్ మాత్రం అలా కాదు తాను అనుకున్నదే చేసుకుంటూ వెళ్తారు అందులో పరాజయం ఎదురైనా కూడా వెనక్కి తగ్గరు.. ఆయన గుండె ధైర్యం కూడా ఎక్కువే.. అందుకని రాజకీయాలలో అసాధారణమైన వ్యక్తిగా పేరు సంపాదించారు.. కేవలం సీఎంగా ఉన్న ఐదేళ్ల పాలనలోనే ప్రతిపక్షాలకు సైతం ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో విపక్ష పార్టీలు మొత్తం ఏకమయ్యాల చేశారు. అందుకు ముఖ్య కారణం చంద్రబాబు అరెస్ట్..
గతంలో ఒక సభలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు లాంటి వారిని అరెస్టు అనివార్యం అయితే మిగిలిన వారి సంగతేంటి అనేట్టుగా తెలియజేశారు.. జగన్ ముక్కుసూటి వ్యక్తిత్వం కలవారిని ఆయన అనుకున్నదే చేస్తారని కూడా చెప్పవచ్చు. ఇలాంటి వాటివల్లే నాయకులకు ఎప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉంటారు జగన్. వైసిపి నాయకులు ఈ విషయాన్ని ఒప్పుకుంటున్న వివక్షాలు మాత్రం ఒప్పుకోలేక జగన్ ఒక సైకో అని అంటూ ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు జగన్లాంటి వారిని చూడలేదు అనుకుంటే అటు జగన్ కి చంద్రబాబు కి ఉన్న జనరేషన్ గ్యాప్ ఇదే అంటూ కూడా తెలియజేస్తున్నారు వైసిపి నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: